Sanjay Raut : గౌహ‌తి ఆఫ‌ర్ వ‌చ్చినా వెళ్ల‌లేదు – సంజ‌య్ రౌత్

బాలా సాహెబ్ భ‌క్తుడిని..సైనికుడిని

Sanjay Raut : శివ‌సేన పార్టీ జాతీయ అధికార ప్ర‌తినిధి, రాజ్య‌స‌భ ఎంపీ సంజ‌య్ రౌత్(Sanjay Raut)  సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. మ‌హా వికాస్ అఘాడీ ప్ర‌భుత్వాన్ని కూల్చి వేసే స‌మ‌యంలో తిరుగుబాటు ప్ర‌క‌టించిన ఏక్ నాథ్ షిండే బ‌స చేసిన గౌహ‌తిలోకి రావాల‌ని త‌న‌కు కూడా పిలుపు వ‌చ్చింద‌ని చెప్పారు.

శ‌నివారం సంజ‌య్ రౌత్ జాతీయ మీడియాతో మాట్లాడారు. కానీ తాను విలువ‌ల‌కు క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని అన్నారు. ఏనాడూ పార్టీ రూల్స్ ను అతిక్ర‌మించ లేద‌ని స్ప‌ష్టం చేశారు స్పోక్స్ ప‌ర్స‌న్. మ‌రాఠా యోధుడు, శివ‌సేన వ్య‌వ‌స్థాప‌కుడు బాలా సాహెబ్ ఠాక్రే త‌న‌కు ఆద‌ర్శ‌మ‌ని అన్నారు.

తిరుగుబాటు ద‌ళంలోకి రావాల‌ని కోరినా తాను వెళ్ల‌లేద‌ని, రాన‌ని ఖ‌రాఖండిగా చెప్పేశాన‌ని చెప్పారు. ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ బాలా సాహెబ్ ను అనుక‌రిస్తూనే ఉంటాన‌ని అన్నారు.

నిజం మీ వైపు ఉన్న‌ప్పుడు తాను ఎందుకు భ‌య‌ప‌డాల‌ని అని సంజ‌య్ రౌత్ ప్ర‌శ్నించారు. ప్ర‌స్తుతం శివ‌సేన అగ్ర నేత చేసిన ఈ వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపాయి.

మొద‌టి నుంచీ రెబ‌ల్స్ కు వ్య‌తిరేకంగా మాట్లాడారు. ఆపై కేంద్ర స‌ర్కార్ పై నిప్పులు చెరిగారు. అంతే కాదు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీని, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాతో పాటు బీజేపీ చీఫ్ , డిప్యూటీ సీఎంగా ఉన్న ఫ‌డ్న‌వీస్ ను టార్గెట్ చేశారు.

ఇదే స‌మ‌యంలో చివ‌రి దాకా మాజీ సీఎం , శివసేన పార్టీ చీఫ్ ఉద్ద‌వ్ ఠాక్రేకు మ‌ద్ద‌తుగా నిల‌బ‌డ్డారు. మ‌నీ లాండ‌రింగ్ కింద సంజ‌య్ రౌత్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) విచారించింది. ఏకంగా 10 గంట‌ల‌కు పైగా ప్ర‌శ్నించింది.

Also Read : సంజ‌య్ రౌత్ ను విచారించిన ఈడీ

Leave A Reply

Your Email Id will not be published!