GV Prakash Music Director : జీవీ సంగీతానికి చిరునామా
జూన్ 13న ప్రకాష్ పుట్టిన రోజు
GV Prakash Music Director : తమిళ సినీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ . అంతా అతడిని జీవీ అని పిలుచుకుంటారు. సంగీతంలోనే కాదు నటనలో కూడా గుర్తింపు పొందారు. ఆయనను ప్రముఖ దర్శకుడు భారతీ రాజీ అయితే ఏకంగా దేవుడి బిడ్డ అని ప్రశంసించారు. నా ప్రియాతి ప్రియమైన సంగీత పుత్రుడికి పుట్టిన రోజు అభినందనలు తెలిపారు.
ఇక జీవీ ప్రకాష్ భారతీయ సంగీత దర్శకుడిగా గుర్తింపు పొందారు. గాయకుడు, నటుడు. ఎక్కువగా తమిళ సినిమాలకు సంగీతం అందించాడు. 2010లో వెలుగులోకి వచ్చాడు. అనంతరం సినీ నిర్మాణం, నటనా రంగంలోకీ ఎంటర్ అయ్యాడు.
జీవీ ప్రకాష్(GV Prakash) ఎవరో కాదు యావత్ ప్రపంచం ఆరాధించే సంగీత దర్శకుడు అల్లా రఖా రెహమాన్ కు స్వయాన మేనల్లుడు. జీవీ ప్రకాష్ భార్య సైంధవి ప్రముఖ గాయని కావడం విశేషం. సంగీత దర్శకుడు కాక ముందు తన మేనమామ వద్ద సంగీత విభాగంలో పాలు పంచుకున్నాడు. కొద్ది రోజులు హరీశ్ జయరాజ్ దగ్గర ఉన్నాడు. ఆ తర్వాత స్వంతంగా తనే సంగీతం అందించేందుకు రెడీ అయ్యాడు.
ఏఆర్ రెహమాన్ అక్క కొడుకు. నాలుగేళ్ల నుంచే సంగీతం అంటే పిచ్చి. జెంట్మిల్మెన్ కు పని చేశాడు జీవీ ప్రకాష్. కొన్ని సినిమాల్లో గాయకుడి అవతారం ఎత్తాడు. వసంత బాలన్ దర్శకత్వంలో వచ్చిన వేయిల్ అనే సినిమాకు తొలిసారి మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేశాడు. సెల్వరాఘవన్ దర్శకత్వంలో వచ్చిన మయాక్కం ఎన్న మూవీలో ధనుష్ హీరో. దీనికి అందించిన సంగీతం పేరు పొందింది. జీవీ ప్రకాష్ కుమార్ ప్రొడక్షన్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. మూడు సినిమాల్లో నటించాడు కూడా.
Also Read : KTR : సంక్షేమంలో ముందంజ ఆడబిడ్డలకు ఆసరా
