GVL Narasimha Rao : టీడీపీ కామెంట్స్ జీవీఎల్ సీరియస్
ఏపీలో మాది ప్రతిపక్ష పాత్ర
GVL Narasimha Rao : భారతీయ జనతా పార్టీ ఎంపీ జీవిఎల్ నరసింహారావు(GVL Narasimha Rao) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏపీలో వైసీపీ, బీజేపీ రెండూ ఒక్కేటనంటూ తెలుగుదేశం పార్టీ కామెంట్స్ చేయడంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో తమదే అసలైన ప్రతిపక్ష పార్టీ అని పేర్కొన్నారు. టీడీపీ చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలేనని పేర్కొన్నారు.
ఇలాంటి చవకబారు విమర్శలు చేయడం మానుకోవాలని సలహా ఇచ్చారు ఎంపీ. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, సీఎం జగన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీని గద్దె దించడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని
స్పష్టం చేశారు. తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవడం లేదని కేవలం ఒక్క పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సారథ్యంలోని జనసేన పార్టీతో తప్పా అని తెలిపారు. వైసీపీతో తమకు ఎలాంటి సంబంధాలు లేవన్నారు. ఇప్పటికే బీజేపీ తన స్టాండ్ ఏమిటో తెలియ చేసిందన్నారు. పదే పదే చెప్పు కోవాల్సిన అవసరం లేదని కుండ బద్దలు కొట్టారు జీవీఎల్ నరసింహారావు.
టీడీపీ నేతలు బీజేపీ, జనసేన కలవడాన్ని తట్టుకోలేక పోతున్నారని ఎద్దేవా చేశారు. ఇంకోసారి ఇలాంటి కూతలు కూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు జీవీఎల్. మరో వైపు స్టిక్కర్ల వార్ కొనసాగుతోందన్నారు. అంటించిన వెంటనే పీకేస్తున్నారంటూ మండిపడ్డారు.
Also Read : హైకోర్టు ఉత్తర్వులపై సునీత పిటిషన్