Harbhajan Singh : భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్, ప్రస్తుత ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ్య సభ్యుడిగా ఎన్నికైన హర్బజన్ సింగ్ (Harbhajan Singh)సంచలన ప్రకటన చేశారు. తాను ఎంపీగా ఉన్నంత వరకు వచ్చే వేతనాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
ఈ మొత్తం డబ్బుల్ని పంజాబ్ రాష్ట్రంలోని రైతుల పిల్లల కోసం ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇవాళ ఇదే విషయాన్ని తెలిపారు. అంతే కాకుండా రాజ్యసభ సభ్యుడిగా దేశ అభివృద్ధికి సాధ్యమైనదంతా చేస్తానని హామీ ఇచ్చారు ఎంపీ.
రైతుల కూతుళ్లు చదువుకునేందుకు, వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేందుకు వీటిని ఇస్తున్నట్లు తెలిపారు భజ్జీ(Harbhajan Singh). రాజకీయవేత్తగా మారిన ఈ అరుదైన క్రికెటర్ రాజ్యసభ జీతాన్ని రైతుల పిల్లలకే కాదు సంక్షేమం కోసం కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఇతర మార్గాల ద్వారా సాధ్యమైనంత మేరకు సహాయం చేసేందుకు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. దేశం కోసం ఏదైనా చేయాలని ఉంది. జై హింద్ అని అన్నారు.
ఇదే విషయాన్ని ట్వీట్ ద్వారా వెల్లడించారు హర్బజన్ సింగ్. అన్ని మార్గాల ద్వారా అభివృద్ది చేసేందుకు తాను ప్రయత్నం చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా మరోసారి సీఎం భగవంత్ మాన్ కు కృతజ్ఞతలు తెలిపారు.
తనను ఎంపీగా ప్రమోట్ చేయడంలో సీఎం కీలక పాత్ర వహించారని , ఆయన అడుగడుగునా పంజాబ్ ప్రజల అభివృద్ధి కోసం ఆలోచిస్తున్నారని కితాబు ఇచ్చారు హర్భజన్ సింగ్.
ఇదిలా ఉండగా సింగ్ గత నెలలో పంజాబ్ నుంచి పార్లమెంట్ ఎగువ సభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Also Read : జో రూట్ ఆటగాళ్లకు రోల్ మోడల్