Harbhajan Singh : ఐపీఎల్ 2022లో ఊహించని రీతిలో పర్ ఫార్మెన్స్ ప్రదర్శిస్తోంది హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్. ఆ జట్టు హెడ్ కోచ్ గా ఉన్న మాజీ భారత క్రికెట్ జట్టు బౌలర్ ఆశిష్ నెహ్రా చాలా తెలివిగా జట్టుకు సంబంధించి ఆటగాళ్లను ఎంపిక చేయడంలో కీలక పాత్ర పోషించాడు.
ఊహించని విధంగా ఆ జట్టు జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఎక్కడా తగ్గడం లేదు. ఇప్పటి వరకు టైటిల్ ఫెవరేట్ గా ఉన్న జట్లకు చుక్కలు చూపిస్తోంది గుజరాత్. ప్రధానంగా అటు బౌలింగ్ లోనూ అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకుంటోంది.
ఆ జట్టు ఇప్పటి వరకు 9 మ్యాచ్ లు ఆడితే 8 మ్యాచ్ లలో విజయాన్ని నమోదు చేసింది. కేవలం ఒకే ఒక్క మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఓటమి పాలైంది. పాయింట్ల పట్టికలో టాప్ లో నిలిచింది.
ఇక ఇప్పటికే ఆ జట్టు ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. ఇక మిగతా జట్లు ప్లే ఆఫ్స్ కోసం నానా తంటాలు పడుతున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్ , సన్ రైజర్స్ హైదరాబాద్ , రాజస్థాన్ రాయల్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు , ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడుతున్నాయి.
ఈ తరుణంలో ఆరెంజ్ క్యాప్ రేసులో రాజస్థాన్ స్టార్ ప్లేయర్ జోస్ బట్లర్ టాప్ లో ఉన్నాడు. ఇప్పటి దాకా 570 రన్స్ తో అదరహో అనేలా చేశాడు. ఇక హార్దిక్ పాండ్యా 308 రన్స్ చేశాడు.
ఈ సందర్భంగా భారత మాజీ క్రికెటర్, ఆప్ ఎంపీ హర్భజన్ సింగ్(Harbhajan Singh) స్పందించాడు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మిగతా ప్లేయర్ల కంటే పాండ్యా బెటర్ అని పేర్కొన్నాడు.
Also Read : చెన్నై వర్సెస్ హైదరాబాద్ బిగ్ ఫైట్