Harbhajan Singh Yoga : యోగాతో మానసిక‌ ప్ర‌శాంత‌త – భ‌జ్జీ

ప్ర‌తి ఒక్క‌రు యోగా ప్రాక్టీస్ చేయాలి

Harbhajan Singh Yoga :  ప్ర‌తి ఒక్క‌రు త‌మ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాల‌ని సూచించాడు భార‌త మాజీ క్రికెట‌ర్ , ప్ర‌స్తుత ఆప్ ఎంపీ హ‌ర్భ‌జ‌న్ సింగ్(Harbhajan Singh Yoga). అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వాన్ని మంగ‌ళ‌వారం ప్ర‌పంచ వ్యాప్తంగా నిర్వ‌హిస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా తాను రోజూ ప్రాక్టీస్ చేస్తున్న యోగాస‌నాల‌ను ఆయ‌న ప్ర‌స్తావించారు. క్ర‌మం త‌ప్ప‌కుండా యోగాను ప్రాక్టీస్ చేయ‌డం అల‌వాటుగా మార్చుకున్నా. గ‌తంలో కంటే ఇప్పుడు చాలా ప్ర‌శాంతంగా ఉంద‌ని పేర్కొన్నాడు.

ఈ మేర‌కు త‌న యోగా ఫోటోల‌ను ట్విట్ట‌ర్ వేదిక‌గా షేర్ చేశాడు ఈ ఎంపీ. మాన‌సికంగా, శారీర‌కంగా చాలా కూల్ గా ఉంద‌ని తెలిపాడు హ‌ర్భ‌జ‌న్ సింగ్  దీని వ‌ల్ల ఎలాంటి ఆందోళ‌న క‌ల‌గ‌డం లేద‌న్నాడు.

ప్ర‌స్తుతం భ‌జ్జీ ఫోటోలు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇవాళ భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి క‌ర్ణాట‌క‌లోని ప్ర‌ముఖ మైసూర్ ప్యాలెస్ ప్రాంగ‌ణంలో 15 వేల మంది తో యోగా దినోత్స‌వాన్ని ఘ‌నంగా నిర్వ‌హించారు.

ఇదే స‌మ‌యంలో భార‌త క్రికెట‌ర్లు పెద్ద ఎత్తున యోగాస‌నాలు చేస్తూ హ‌ల్ చ‌ల్ చేస్తున్నారు. నిత్యం ఆరోగ్య‌క‌రంగా ఉండాల‌న్నా, ఒత్తిళ్ల నుంచి బ‌య‌ట ప‌డాలంటే యోగా ఒక్క‌టే మార్గ‌మ‌ని సూచించాడు ఈ మాజీ క్రికెట‌ర్(Harbhajan Singh Yoga).

ఇప్ప‌టికైనా యోగా ప్రాధాన్య‌త‌ను గుర్తించాల‌ని సూచించాడు. ఎలాంటి ఖ‌ర్చు లేని ఈ యోగా ఒక అద్భుత‌మైన టెక్నిక్ గా ప‌నికి వ‌స్తుంద‌ని తెలిపాడు.

ఇదిలా ఉండ‌గా సెప్టెంబ‌ర్ 27, 2014న ఐక్య‌రాజ్య‌స‌మితి జ‌న‌ర‌ల్ అసెంబ్లీలో ప్ర‌ధాని మోదీ ప్ర‌సంగించారు. ఆనాడు యోగా గురించి ప్ర‌స్తావించారు.

భార‌త దేశం ఆమోదించిన ముసాయిదా తీర్మానాన్ని 177 దేశాలు స‌మ‌ర్థించాయి. విశ్వ వ్యాప్తంగా దీనికి గుర్తింపు పెర‌గ‌డంతో ఐక్య రాజ్య స‌మితి జూన్ 21ని అంత‌ర్జాతీయ యోగా దినోత్సంగా ప్ర‌క‌టించింది.

Also Read : పీఎం యోగా అవార్డులు డిక్లేర్

Leave A Reply

Your Email Id will not be published!