Harbhajan Singh : రాజస్తాన్ పై బెంగళూరుదే విజయం – భజ్జీ
క్వాలిఫయిర్ -2లో ఆర్సీబీదే హవా
Harbhajan Singh : భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్, ఆప్ ఎంపీ హర్భజన్ సింగ్(Harbhajan Singh) సంచలన కామెంట్స్ చేశాడు. గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా మోదీ స్టేడియంలో జరిగే క్వాలిఫయిర్ -2 మ్యాచ్ లో కచ్చితంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశాడు భజ్జీ.
అంతే కాదు రాజస్తాన్ పై విజయం సాధించడమే కాదు ఏకంగా ఐపీఎల్ 2022 టైటిల్ కూడా ఎగరేసుకు పోతుందన్నాడు. ఎందుకంటే బెంగళూరు ఏ జట్టుకు లేనంత బలం ఉందన్నాడు.
అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ లోనూ దుమ్ము రేపుతుందన్నాడు. లక్నోతో జరిగిన జట్టును మట్టి కరిపించిన తీరు తనను విస్తు పోయేలా చేసిందన్నాడు భజ్జీ(Harbhajan Singh).
ఇప్పటికే ఫైనల్ కు చేరింది గుజరాత్ టైటాన్స్. ఇవాళ జరిగే కీలక పోరులో రాజస్తాన్ తో గెలిస్తే నేరుగా ఫైనల్ కు చేరుతుంది. ప్రధానంగా రాజస్థాన్ కంటే బెంళూరు జట్టులో బలమైన, స్టార్ ఆటగాళ్లు ఉన్నారు.
వారు ఏ సమయంలోనైనా రాణించ గలిగే సత్తా కలిగి ఉన్నారని పేర్కొన్నారు హర్భజన్ సింగ్. ప్రధానంగా వాళ్ల బౌలింగ్ భయంకరంగా ఉందన్నాడు. తన మనసు మాత్రం ఆర్సీబీ గెలుస్తుందని చెబుతోందన్నాడు.
అలాగని తాను రాజస్తాన్ రాయల్స్ జట్టును తక్కువ చేయడం లేదన్నాడు. ఒకటో స్థానం నుంచి 9వ స్థానం దాకా బ్యాటింగ్ చేసే దమ్ముంది.
ప్రధానంగా గ్లెన్ మ్యాక్స్ వెల్, పటిదార్, విరాట్ కోహ్లీ, డుప్లెసిస్ , లెమ్రూన్ , దినేశ్ కార్తీక్, హర్షల్ పటేల్ ఇలా ప్రతి ఒక్కరు ఆడతారని తెలిపాడు. ఇక రాజస్థాన్ లో ఎప్పుడు ఎవరు ఆడతారో చెప్పలేని పరిస్థితి నెలకొందన్నారు.
Also Read : ఐపీఎల్ రూల్ ను ఉల్లంఘించిన దినేష్ కార్తీక్