Harbhajan Singh : ఊపిరి పీల్చుకున్న అగర్వాల్ – భజ్జీ
సంచలన కామెంట్స్ చేసిన ఆప్ ఎంపీ
Harbhajan Singh : భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్, దిగ్గజ స్పిన్నర్ , ఆప్ ఎంపీ హర్భజన్ సింగ్(Harbhajan Singh) సంచలన కామెంట్స్ చేశాడు. ప్లే ఆఫ్స్ కు చేరుకోకుండానే ఇంటి బాట పట్టిన పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ స్కిప్పర్ మయాంక్ అగర్వాల్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఈసారి కెప్టెన్ గా ప్రమోషన్ వచ్చినా ముందుండి నడిపించడంలో ఫెయిల్ అయ్యాడంటూ పేర్కొన్నాడు. ఒక రకంగా ఐపీఎల్ ముగియడంతో మనోడు ఊపిరి పీల్చుకున్నాడంటూ ఎద్దేవా చేశాడు భజ్జీ.
ఆటగాడిగా అద్భుతంగా ఆడుతూ వచ్చిన మయాంక్ అగర్వాల్ ఎప్పుడైతే పంజాబ్ కింగ్స్ జట్టుకు కెప్టెన్ గా ఎంపికయ్యాడో ఆనాటి నుంచి నేటి దాకా తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడని స్పష్టం చేశాడు.
దీంతో అటు ఆటపై ఫోకస్ పెట్టలేక ఫెయిల్ అయ్యాడు. ఇక నాయకుడిగా పూర్తిగా నిరాశ పరిచాడంటూ తెలిపాడు హర్బజన్ సింగ్(Harbhajan Singh). ఐపీఎల్ ముగియడం గుజరాత్ టైటాన్స్ టైటిల్ గెలుచుకుంది.
రాజస్తాన్ రాయల్స్ ను 7 వికెట్ల తేడాతో ఓడించి కప్పు కైవసం చేసుకుంది. ఐపీఎల్ లో నిష్క్రమిస్తున్న సమయంలో మయాంక్ అగర్వాల్ ఊపిరి పీల్చుకున్నట్లు తనకు కనిపించిందని పేర్కొన్నాడు.
పూర్తిగా నిలకడగా ఆడలేక జట్టును కొంప ముంచాడంటూ మండిపడ్డారు. ఎవరైనా సరే కెప్టెన్ అన్నాక తాను ఆడాలి, లేదా జట్టును నడిపించాలి. ఇవేవీ మయాంక్ అగర్వాల్ చేయలేక చేతులెత్తేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఐపీఎల్ లో 14 మ్యాచ్ లు పంజాబ్ కింగ్స్ 7 విజయాలు సాధించింది. పాయింట్ల పట్టికలో ఆరవ స్థానంలో నిలిచింది. 31 ఏళ్ల మయాంక్ 13 మ్యాచ్ లు ఆడి 196 పరుగులు మాత్రమే చేశాడు.
Also Read : రాజకీయ అరంగేట్రం అంతా అబద్దం