Harbhajan Singh : భారత జట్టుకు కాబోయే సారథి పాండ్యానే
అతడు ఎంఎస్ ధోనీ లాంటోడు
Harbhajan Singh : భారత మాజీ క్రికెటర్ , ఆప్ ఎంపీ హర్భజన్ సింగ్(Harbhajan Singh) షాకింగ్ కామెంట్స్ చేశాడు. భారత జట్టుకు కాబోయే కెప్టెన్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యానేనని జోష్యం చెప్పాడు.
యూఏఈ వేదికగా ప్రారంభమైన ఆసియా కప్ -2022లో పాకిస్తాన్ పై అద్భుత విజయాన్ని నమోదు చేసింది టీమిండియా. ఈ మ్యాచ్ ను ఒంటి చేత్తో గెలిపించాడు పాండ్యా.
25 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. కేవలం 17 బంతులు ఎదుర్కొని 33 రన్స్ చేశాడు. ఇందులో 4 ఫోర్లు ఒక సిక్సర్ ఉంది. ప్రముఖ తాజా , మాజీ క్రికెటర్లు హార్దిక్ పాండ్యాను(Hardik Pandya) ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
ప్రధానంగా పాకిస్తాన్ హెడ్ కోచ్ మైక్ ఆర్థర్ అయితే ఏకంగా భారత జట్టు అంతా ఒక ఎత్తు పాండ్యా ఒక ఎత్తు అని ప్రశంసించాడు. 11 మంది ఆటగాళ్లతో అతడు సమానమని పేర్కొన్నాడు.
తాజాగా హర్బజన్ సింగ్ ఏకంగా ఆకాశానికి ఎత్తేశాడు. తనకు పాండ్యాలో భారత జట్టుకు ఎనలేని విజయాలు సాధించి పెట్టిన మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) కనిపిస్తున్నాడని కితాబు ఇచ్చాడు.
సెలెక్టర్లు పనిగట్టుకుని ఆలోచించాల్సిన అవసరం లేదన్నాడు. భవిష్యత్తులో భారత జట్టుకు(Team India) నాయకత్వం వహించే సత్తా , నైపుణ్యం దమ్ము కలిగిన పాండ్యాను వరిస్తుందని తాను ఆశిస్తున్నట్లు తెలిపాడు.
గతంలో సక్సెస్ ఫుల్ కెప్టెన్లలో మహ్మద్ అజహరుద్దీన్, గంగూలీ, ద్రవిడ్ , కుంబ్లే, ధోనీ వంటి దిగ్గజాలు ఉన్నారు. వారి సరసన నిలిచేందుకు ఆస్కారం ప్రస్తుతం హార్దిక్ పాండ్యాకు మాత్రమే ఉందని తాను భావిస్తున్నట్లు తెలిపాడు.
Also Read : భారీ గెలుపుపై కన్నేసిన భారత్