Hardik Pandya : ఆట అన్నాక ఒడిదుడుకులు సహజం. ఎప్పుడు ఎవరు షైన్ అవుతారో ఇంకెప్పుడు అన్ పాపులర్ అవుతారో చెప్పడం కష్టం. విచిత్రం ఏమిటంటే ఊహించని రీతిలో అవకాశం తలుపు తడితే, దానిని సద్వినియోగం చేసుకుంటే ఎలా ఉంటుంది.
అదిగో అలాంటి గోల్డెన్ ఛాన్స్ వచ్చింది ఈ ఏడాది హార్దిక్ పాండ్యాకు. గాయం కారణంగా ఫిట్ కాలేదు. అంతెందుకు తన ఆట తీరు కూడా పేలవంగా ఉంది. ఈ తరుణంలో జట్టులోనే చోటు కోల్పోయాడు.
మరిచి పోయే సమయంలో మళ్లీ వెలుగులోకి వచ్చాడు. చీకటినీ చీల్చుకుంటూ, గాయాలను తట్టుకుంటూ,, దెబ్బ తిన్న పులిలా విజృంభించాడు.
తల్చుకుంటే ఏదైనా చేయవచ్చని నిరూపిస్తున్నాడు హార్దిక్ పాండ్యా(Hardik Pandya). నిన్నటి దాకా విమర్శించిన నోళ్లు ఇవాళ పొగుడుతున్నాయి. ఆహా ఓహో అంటున్నాయి.
ఇది కళ్ల ముందు జరుగుతున్న వాస్తవం. ఎవరూ ఊహించ లేదు పాండ్యా ఒక జట్టుకు కెప్టెన్ అవుతాడని. కానీ గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం ఏకంగా పాండ్యాపై నమ్మకం ఉంచింది.
ఆ నమ్మకాన్ని కోల్పోకుండా జట్టును నడిపించాడు. ఇప్పుడు ఐపీఎల్ జట్టులో గుజరాత్ టైటాన్స్ జైత్రయాత్ర కొనసాగిస్తోంది. కెప్టెన్ గా దుమ్ము రేపుతున్నాడు. తన జట్టులోని ఆటగాళ్లతో గెలిచేలా చేస్తున్నాడు.
తాజాగా మనోడు ఆట తీరుపై, భవిష్యత్తులో జట్టులోకి రావడంపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. తాను భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలన్నది తన కల అన్నాడు.
తను టీమిండియాలోకి వస్తానని అనుకోవడం లేదన్నాడు. తన ఫోకస్ అంతా ఐపీఎల్ పై ఉందన్నాడు పాండ్యా.
Also Read : ఆర్సీబీ నా ఫెవరేట్ టీం – హ్యారీ కేన్