Hardik Pandya : క‌పిల్ దేవ్ ముందు నేనెంత – హార్దిక్ పాండ్యా

త‌న‌ను ఆల్ రౌండ‌ర్ తో పోల్చ‌వ‌ద్ద‌న్న క్రికెట‌ర్

Hardik Pandya : ఆస్ట్రేలియా వేదిక‌గా ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ కొన‌సాగుతోంది. సూప‌ర్-12 లో భాగంగా జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో పాకిస్తాన్ పై టీమిండియా గెలుపొందింది. ఒక ర‌కంగా చెప్పాలంటే న‌రాలు తెగే ఉత్కంఠ కొన‌సాగుతూ వ‌చ్చింది చివ‌రి బంతి వ‌ర‌కు. ఆఖ‌రు బంతిని ర‌విచంద్ర‌న్ అశ్విన్ ఆడ‌డంతో చిర‌స్మ‌ర‌ణీయ‌మైన గెలుపు అందుకుంది.

ఈ త‌రుణంలో ఒకానొక ద‌శ‌లో ఓట‌మి ఖాయ‌మ‌ని అనుకున్న త‌రుణంలో భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ ,ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) తో క‌లిసి ఆల్ రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా అద్భుతంగా ఆడాడు. విజ‌య‌పు అంచుల దాకా తీసుకు వెళ్లాడు. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టును ప‌రుగులు చేయ‌నీయ‌కుండా క‌ట్ట‌డి చేశాడు.

మొద‌ట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 159 ప‌రుగులు చేసింది. 160 ప‌రుగుల టార్గెట్ తో బ‌రిలోకి దిగిన భార‌త జ‌ట్టు 64 ప‌రుగుల‌కే 4 వికెట్లు పోగొట్టుకుని క్లిష్ట ప‌రిస్థితుల్లో ఉన్న స‌మ‌యంలో కోహ్లీతో పాటు త‌ను కూడా ఆడాడు పాండ్యా. 30 ప‌రుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు.

ఆపై 37 బంతులు ఎదుర్కొని 40 ర‌న్స్ చేశాడు. జ‌ట్టు విజ‌యంలో కోహ్లీతో పాటు పాండ్యా కీల‌కంగా మారాడు. అంతే కాదు టి20ల్లో 1000 ర‌న్స్ చేసి 50 వికెట్లు తీసిన మొద‌టి క్రికెట‌ర్ గా నిలిచాడు. మ్యాచ్ ముగిశాక మాజీ క్రికెట‌ర్ శ్రీ‌కాంత్ పాండ్యాను(Hardik Pandya) ఆనాటి క‌పిల్ దేవ్ తో పోల్చాడు. దీనిపై స్పందించిన పాండ్యా క‌పిల్ గ్రేట్ క్రికెట‌ర్ అని ఆయ‌న ముందు తానెంత అన్నాడు.

Also Read : బాబ‌ర్ కెప్టెన్సీ వ‌దులుకుంటే బెట‌ర్ – మాలిక్

Leave A Reply

Your Email Id will not be published!