Hardik Pandya : పాండ్యాకు ప్ర‌మోష‌న్ ఐర్లండ్ టూర్ కు కెప్టెన్

ప్ర‌క‌టించిన బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్

Hardik Pandya : అదృష్టం అంటే హార్దిక్ పాండ్యాదే(Hardik Pandya). నిన్న‌టి దాకా జ‌ట్టుకు దూరంగా ఉన్నాడు. కానీ ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్ ) 2022 అత‌డి కెరీర్ కు ప్రాణం పోసింది. ఆట‌గాడిగా అద్భుతంగా రాణించాడు.

గుజ‌రాత్ టైటాన్స్ కు కెప్టెన్ గా ముందుండి న‌డిపించాడు. ఏకంగా మొద‌టిసారి ఎంట్రీ ఇస్తూనే ఐపీఎల్ చ‌రిత్ర‌లో రికార్డు నమోదు చేశాడు.

బౌల‌ర్ గా, బ్యాట‌ర్ గా, కెప్టెన్ గా త‌న‌ను ప్రూవ్ చేసుకున్నాడు.

ఏకంగా జ‌ట్టుకు ఐపీఎల్ క‌ప్ ను తీసుకు వ‌చ్చాడు. దీంతో జాతీయ జ‌ట్టుకు దూరంగా ఉన్న అత‌డిని బీసీసీఐ ఏరికోరి ఎంపిక చేసింది. ఆపై ఊహించ‌ని రీతిలో ఐర్లాండ్ టూర్ కు కెప్టెన్ గా ఎంపిక చేసింది.

ఒక ర‌కంగా చెప్పాలంటే పాండ్యాకు ఇది ప్ర‌మోష‌న్ అని చెప్ప‌క త‌ప్ప‌దు. జూన్ 26, 28 తేదీల‌లో ఐర్లాండ్ తో జ‌రిగే 2 మ్యాచ్ ల టి20 సీరీస్ కోసం 17 మంది స‌భ్యుల‌తో కూడిన భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించింది.

పాండ్యా కెప్టెన్ కాగా భువ‌నేశ్వ‌ర్ కుమార్ ను వైస్ కెప్టెన్ గా నియ‌మించింది. కాగా బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ చేత‌న్ శ‌ర్మ ఈసారి జ‌ట్టు

ఎంపిక‌పై ఫుల్ ఫోక‌స్ పెట్టాడు. తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటూ వ‌స్తున్న దానికి పుల్ స్టాప్ పెట్టాడు.

అద్భుత‌మైన ఆట తీరుతో ఆక‌ట్టుకున్నా కేర‌ళ స్టార్ హిట్ట‌ర్ సంజూ శాంస‌న్ ను ఎంపిక చేయ‌క పోవ‌డాన్ని త‌ప్పు ప‌ట్టారు మాజీ ఆట‌గాళ్లు.

మాజీ కెప్టెన్ క‌పిల్ దేవ్ సైతం ఇదే విష‌యాన్ని ఎత్తి చూపాడు.

దీంతో ఐర్లాండ్ టూర్ కు అత‌డిని తీసుకున్నారు. ఇక జ‌ట్టు ప‌రంగా చూస్తే ఇలా ఉంది. హార్దిక్ పాండ్యా(Hardik Pandya) కెప్టెన్ కాగా , భువీ వైస్ కెప్టెన్.

ఇషాన్ కిష‌న్ , రుతురాజ్ గైక్వాడ్ , సంజూ శాంస‌న్ , సూర్య కుమార్ యాద‌వ్ , వెంక‌టేశ్ అయ్య‌ర్, దీప‌క్ హూడా, రాహుల్ త్రిపాఠి, దినేశ్ కార్తిక్,

యుజ్వేంద్ర చ‌హ‌ల్ , అక్ష‌ర్ ప‌టేల్ , ర‌వి బిష్ణోయ్ , హ‌ర్ష‌ల్ ప‌టేల్ , అవేశ్ ఖాన్ , అర్ష దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ ఉన్నారు.

Also Read : మ‌హిళా క్రీడాకారిణిల‌కు ఖుష్ క‌బ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!