AP New DGP : ఏపీకి కొత్త పోలీస్ బాస్ గా రానున్న ‘హరీష్ కుమార్ గుప్తా’
హరీష్ కుమార్ గుప్తా స్వస్థలం జమ్మూ కశ్మీర్...
AP New DGP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. ఇప్పటి వరకు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌గా ఆయన విధులు నిర్వహించారు. అయితే ప్రస్తుతం డీజీపీగా ఉన్న సీహెచ్ ద్వారకా తిరుమల రావు జనవరి 31వ తేదీన రిటైర్ కాబోతున్నారు. ఈ నేపథ్యంలో హరీష్ కుమార్ గుప్తా పేరును కొత్త డీజీపీగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అదీకాక.. ద్వారకా తిరుమల రావు రిటైర్ కాబోతున్న తరుణంలో.. రాష్ట్రానికి కొత్త డీజీపీగా మాదిరెడ్డి ప్రతాప్‌తోపాటు హరీష్ కుమార్ గుప్తా పేరును పరిశీలించినట్లు సమాచారం. ఈ రెండు పేర్లలో హరీష్ కుమార్ పేరును కొత్త డీజీపీ పదవి వరించింది.
AP New DGP ‘Harish Kumar Gupta’
హరీష్ కుమార్ గుప్తా స్వస్థలం జమ్మూ కశ్మీర్. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏపీ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన సంగతి తెలిసిందే. కూటమిప్రభుత్వం కొలువు తీరిన అనంతరం కొత్త డీజీపీగా సిహెచ్ ద్వారకా తిరుమల రావును ప్రభుత్వం నియమించిన విషయం విధితమే. 1992 బ్యాచ్ ఆంధ్ర కేడర్ ఐపీఎస్ అధికారి అయిన హరీష్ కుమార్ గుప్తా.. పలు జిల్లాలకు ఎస్పీగా పని చేశారు.
Also Read : Minister Parthasarathy : వైసీపీ చేసిన అప్పు మూర్ఖత్వపు ఆలోచనలకు ఖర్చు చేసింది