AP DGP : ఐపీఎస్ ‘హరీష్ కుమార్ గుప్తాకు’ ఏపీ పూర్తిస్థాయి డీజీపీగా బాధ్యతలు
రెండేళ్ల పాటు హరీష్ గుప్తా తన సేవల్ని దృఢ సంకల్పంతో అందిస్తారని పేర్కొంది...
AP DGP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుల్ టైం డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి హరీష్ కుమార్ గుప్తా పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర పోలీసు దళానికి నిర్ణయాత్మక, క్రమశిక్షణ కలిగిన, దార్శనిక నేతృత్వాన్ని హరీష్ గుప్తా అందించనున్నారని ఏపీ పోలీస్ శాఖ తెలిపింది. రెండేళ్ల పాటు హరీష్ గుప్తా తన సేవల్ని దృఢ సంకల్పంతో అందిస్తారని పేర్కొంది. ఇలా ఉండగా, రాష్ట్ర పూర్తిస్థాయి డీజీపీగా హరీష్‌కుమార్ గుప్తా శనివారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. ఫిబ్రవరి 1 నుంచి ఆయన ఇన్‌ఛార్జి డీజీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
IPS Harish Kumar Gupta as a AP DGP
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) పంపిన ప్యానల్‌లో నుంచి హరీష్‌కుమార్ గుప్తాను ఎంపిక చేసుకున్న చంద్రబాబు ప్రభుత్వం ఇటీవల హరీష్ గుప్తాను పూర్తిస్థాయి డీజీపీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన బాధ్యతలు తీసుకున్నారు. పదవీ విరమణ తేదీతో సంబంధం లేకుండా రెండేళ్లపాటు హరీష్‌కుమార్ గుప్తా ఈ పోస్టులో కొనసాగుతారు. ఈ సందర్భంగా సీనియర్ ఐపీఎస్ అధికారులంతా గుప్తాను కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం డీజీపీ వారితో సమావేశమై పోలీసు శాఖ ప్రాధమ్యాల్ని వివరించారు.
Also Read : MLC Kavitha Letter : సీఎం రేవంత్ రెడ్డికి ఆ అంశంపై ఎమ్మెల్సీ కవిత కీలక లేఖ