Harish Rao: కన్నీరు పెట్టుకున్న మాజీ మంత్రి హరీశ్ రావు
కన్నీరు పెట్టుకున్న మాజీ మంత్రి హరీశ్ రావు
Harish Rao : మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు భావోద్వేగానికి గురయ్యారు. సిద్ధిపేటలో విద్యార్థుల కోసం లీడ్ ఇండియా ఆధ్వర్యంలో ‘భద్రంగా ఉండాలి.. భవిష్యత్లో ఎదగాలి’ అనే అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మెట్రో గార్డెన్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హరీశ్ రావు(Harish Rao) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ చిన్నారి చెప్పిన మాటలకు ఆయన చలించిపోయారు… కంటతడి పెట్టారు. ఈ సందర్భంగా ఆ విద్యార్థిని మాట్లాడుతూ తన తండ్రి చిన్నప్పుడే చనిపోయాడని… తల్లే తనను కష్టపడి చదివిస్తోందని కన్నీళ్లు పెట్టుకుంది. ఆ చిన్నారి మాటలు విన్న హరీశ్ రావుతో పాటు ఆ వేదికపై ఉన్న వారంతా ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. ఆ బాలికను ఆత్మీయంగా దగ్గరికి తీసుకునన్న హరీష్రావు… వేదికపై తన పక్కన కూర్చోబెట్టుకుని ఓదార్చారు.
Harish Rao – ఇంతకీ ఆ చిన్నారి తల్లి ఏమందంటే ?
“అందరికీ నమస్కారం.. నేను ఇక్కడికి రావడానికి కారణం మా మమ్మీ. నేను రెండవ తరగతిలో ఉన్నప్పుడే మా నాన్న చనిపోయాడు. మా మమ్మీ కష్టపడి స్కూల్ ఫీజు కడుతూ నన్ను చదివిస్తోంది. ఇప్పటి నుంచి మా మమ్మీని మంచిగా చూసుకుంటాను. మా మమ్మీకి మంచి పేరు తీసుకొస్తాను. మా మమ్మీకి, డాడీ.. వాళ్ల పేర్లకు వాల్యూ తెచ్చేలా నడుచుకుంటాను. ధన్యవాదాలు.” అంటూ ఏడుస్తూనే మాట్లాడింది ఆ చిన్నారి. ఆ దృశ్యాన్ని చూసి హరీష్ రావు చలించిపోయారు. ఆ చిన్న పాపను దగ్గరకి తీసుకుని ఓదార్చారు. ఈ క్రమంలో ఆయన కంటి నుంచీ కన్నీళ్లు కారిపోయాయి. చిన్నారి మాటలకి అక్కడున్న వాళ్లంతా చలించి పోయారు.
Also Read : BJP Leader Dilip Ghosh: ఐపీఎల్ వేదికగా ప్రేమలో పడ్డ బీజేపీ నేత ! 60వ ఏట పెళ్లి !