Harish Rao : రూ.50 కోట్లకు పీసీసీ చీఫ్ పదవి
రేవంత్ కొనుక్కున్నారన్న హరీశ్ రావు
Harish Rao : హైదరాబాద్ – మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు(Harish Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర శాసన సభ బుధవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క 42 పేజీలతో కూడిన శ్వేత పత్రం రిలీజ్ చేశారు.
Harish Rao Comments Viral
ఈ సందర్బంగా చర్చలో పాల్గొన్న హరీశ్ రావు కీలక కామెంట్స్ కలకలం రేపింది. ఇందులో భాగంగా రూ. 50 కోట్లకు పీసీసీ చీఫ్ పదవిని ప్రస్తుత సీఎంగా ఉన్న ఎనుముల రేవంత్ రెడ్డి కొనుగోలు చేశారంటూ ఆరోపణలు చేశారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. ఈ సందర్బంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సీరియస్ అయ్యారు.
ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం మంచి పద్దతి కాదన్నారు. తాను చేసిన వ్యాఖ్యలను ఉప సంహరించు కోవాలని సూచించారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తన్నీరు హరీశ్ రావు.
దీనిపై అభ్యంతరం తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి , మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ . ఈ సందర్భంగా రికార్డుల నుంచి హరీశ్ రావు మాట్లాడిన మాటలను తొలగించాలని సభ్యులు డిమాండ్ చేశారు.
Also Read : Telangana Assembly : 42 పేజీలతో శ్వేత పత్రం విడుదల