CSK SQUAD IPL 2024 : చెన్నై సూప‌ర్ కింగ్స్ అదుర్స్

ఆల్ రౌండ‌ర్ల‌తో ఫుల్ స్క్వాడ్

CSK SQUAD IPL 2024 : ఐపీఎల్ మినీ వేలం పాటలో ఆటగాళ్ల‌కు అదుర్స్ అనిపించేలా చేశారు చెన్నై సూప‌ర్ కింగ్స్(CSK). ఆల్ రౌండ‌ర్లు కీల‌కంగా ఉన్నారు జ‌ట్టులో. వ‌ర‌ల్డ్ వైడ్ గా బిగ్ హిట్ట‌ర్ గా గుర్తింపు పొందిన న్యూజిలాండ్ క్రికెట‌ర్ ర‌చిన్ ర‌వీంద్ర‌ను తీసుకుంది సీఎస్కే యాజ‌మాన్యం.

CSK SQUAD IPL 2024 Updates

విచిత్రం ఏమిటంటే 20 ఏళ్ల అన్ క్యాప్డ్ ప్లేయ‌ర్ స‌మీర్ రిజ్వీని రూ. 8.40 కోట్ల‌కు కొనుగోలు చేసింది. ఇంత పెద్ద మొత్తంలో ధ‌ర చెల్లించ‌డం అంద‌రినీ విస్తు పోయేలా చేసింది. ఇదే స‌మ‌యంలో న్యూజిలాండ్ కు చెందిన మిచెల్ ను రూ. 14 కోట్లు చెల్లించింది.

ర‌వీంద్ర‌ను రూ. 1.80 కోట్ల‌కు కైవ‌సం చేసుకుంది. రూ. 4 కోట్ల‌కు ఠాకూర్ ను తీసుకుంది. బంగ్లా పేస‌ర్ ర‌హీమ్ ను కూడా కొనుగోలు చేసింది. ముస్తాఫిజార్ కు రూ. 2 కోట్లు వెచ్చింది. ఇక అవ‌నీష్ ను రెండు కోట్లు పెట్టింది.

ఇక జ‌ట్టు ప‌రంగా చూస్తే జార్ఖండ్ డైన‌మిట్ మ‌హేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్ కాగా ముంబై స్టార్ ప్లేయ‌ర్ ర‌హానే, చాహ‌ర్ , కాన్వే, తీక్ష‌ణ‌, ప‌తిరాణా, సాంట‌ర్న్ , అలీ, చౌద‌రి, సింధు , సోలంకి, రాజ వ‌ర్ద‌న్ , రుతురాజ్ , ర‌షీద్ , దూబే , సిమ‌ర్జీత్ , తుషార్ తో క‌లిపి 19 మందిని తీసుకుంది.

Also Read : KKR SQUD IPL 2024 : క‌ప్ పై క‌న్నేసిన కోల్ కతా

Leave A Reply

Your Email Id will not be published!