Raghuram Rajan Rahul : సామ‌ర‌స్యం ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు బ‌లం

రాహుల్ తో స్ప‌ష్టం చేసిన ర‌ఘురామ్ రాజ‌న్

Raghuram Rajan Rahul : ప్రపంచంలోనే మోస్ట్ పాపుల‌ర్ ఎకాన‌మిస్ట్ గా పేరొందిన మాజీ ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ ర‌ఘురామ్ రాజ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న రాహుల్ చేప‌ట్టిన యాత్ర‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా రాహుల్ గాంధీ ర‌ఘురామ్ రాజ‌న్(Raghuram Rajan) తో చాలా సేపు సంభాషించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. రాహుల్ అడిగిన అన్ని ప్ర‌శ్న‌ల‌కు చాలా కూల్ గా స‌మాధానాలు ఇచ్చారు ర‌ఘురామ్ రాజ‌న్ .

దేశం ఎలా ఆర్థికంగా బ‌ల‌ప‌డాలి. ఏ ర‌క‌మైన స‌వాళ్ల‌ను ఎదుర్కొంటోంది. క‌రోనా స‌మ‌యంలో ఎలా ఆర్థిక వ్య‌వ‌స్థ చితికి పోయిందనే దానిపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సంప‌న్న‌మైన ఆర్థిక వ్య‌వ‌స్థకు సామ‌ర‌స్య‌మే పునాది అని స్ప‌ష్టం చేశారు ర‌ఘురామ్ రాజ‌న్(Raghuram Rajan). స్వేచ్ఛ అనేది ప్ర‌జాస్వామ్యానికి ఆయుప‌ట్టు. ఈ సంద‌ర్భంగా ఆర్బీఐ మాజీ గ‌వ‌ర్న‌ర్ రాహుల్ గాంధీని ప్ర‌శంసించారు. ఏ రాజ‌కీయ పార్టీలో ఉన్న‌ప్ప‌టికీ మ‌త సామ‌ర‌స్యం, ఐక్య‌త కోసం యాత్ర అత్యంత అవ‌స‌ర‌మ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

బాహ్య భ‌ద్ర‌త‌ను క‌లిగి ఉండాలంటే అంత‌ర్గ‌త సామ‌ర‌స్యాన్ని క‌లిగి ఉండాల‌న్నారు. అంత‌ర్గ‌తంగా పోరాడ‌వ‌చ్చు. కానీ చాలా మంది అణిచి వేస్తామ‌ని అంటారు. కానీ అది సాధ్యం కాద‌న్నారు రఘురామ్ రాజ‌న్. యావ‌త్ ప్ర‌పంచం భార‌త దేశం వైపు చూస్తోంది. ఎందుక‌ని ఇక్క‌డ ప్ర‌జాస్వామ్యం ప‌రిఢ విల్లుతోంద‌ని. కాబ‌ట్టి మ‌నం తీసుకునే ప్ర‌తి నిర్ణ‌యం ప్ర‌భావితం చేస్తుంద‌న్నారు ర‌ఘురామ్ రాజ‌న్. మ‌నం ఏ మార్గంలో వెళుతున్నామో ఏలుతున్న వారు ఆలోచించు కోవాల‌ని సూచించారు.

ఆర్థిక వ్య‌వ‌స్థ‌, పెరుగుతున్న ఆదాయ అస‌మాన‌త‌లు, నిరుద్యోగ స‌వాళ్లు, చిన్న‌, మ‌ధ్య త‌ర‌హా వ్యాపారాలు, విద్యా వ్య‌వ‌స్థ‌, ఎగుమ‌తి, దిగుమతి విధానాల‌లో అస‌మాన‌త‌లు , కొన్ని రంగాల‌లో వృద్ధి సామ‌ర్థ్యం గురించి ర‌ఘురామ్ రాజ‌న్ – రాహుల్ గాంధీ చ‌ర్చించారు. ఆర్థికంగా ప్ర‌స్తుత సంవ‌త్స‌రం కంటే వ‌చ్చే ఏడాది 2023 మ‌రింత క‌ష్ట‌త‌రంగా మారుతుంద‌ని హెచ్చ‌రించారు మాజీ ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్.

ప్ర‌పంచంలో వృద్ది మంద‌గించ‌డం వ‌ల్ల వ‌డ్డీ రేట్లు పెరుగుతున్నాయి. అది ఆర్థిక వృద్దిని త‌గ్గిస్తుంద‌న్నారు. భార‌త్ కు ఇది పెద్ద దెబ్బ అని హెచ్చ‌రించారు. భార‌తీయ వ‌డ్డీ ధ‌ర‌లు కూడా పెరిగాయి. కానీ ఇదే స‌మ‌యంలో భార‌తీయ ఎగుమ‌తులు మంద‌గించాయ‌ని గుర్తించాల‌న్నారు. పెట్టుబ‌డిదారీ విధానానికి వ్య‌తిరేకంగా ఉండ‌లేం. కానీ గుత్తాధిప‌త్యానికి వ్య‌తిరేకంగా పోరాడాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌న్నారు.

Also Read : గాంధీ విలువ‌లు నిల‌బ‌డేలా చేశాయి

Leave A Reply

Your Email Id will not be published!