Harsh Goenka: లోక్ సభ ఎన్నికల ఫలితాలపై పారిశ్రామిక వేత్త హర్ష గోయెంకా ఫన్నీ పోస్టు !
లోక్ సభ ఎన్నికల ఫలితాలపై పారిశ్రామిక వేత్త హర్ష గోయెంకా ఫన్నీ పోస్టు !
Harsh Goenka: వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేసే విషయాలతో పాటు వర్తమాన అంశాలను తరచూ ప్రస్తావించే ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా(Harsh Goenka)… లోక్ సభ ఎన్నిలక ఫలితాలపై ఆశక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుత ఫలితాల్లో ఎన్డీయే కూటమి మెజార్టీ మార్కు దాటింది. అలాగే విపక్ష ‘ఇండియా’ కూటమి ఎగ్జిట్ పోల్స్ అంచనాలను భిన్నంగా మెరిపించింది. దీనిని ఉద్దేశించి… ‘‘ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుంది కాబట్టి బీజేపీ హ్యాపీ. వందసీట్లు వచ్చాయి కాబట్టి కాంగ్రెస్ హ్యాపీ. ఉత్తర్ ప్రదేశ్‌లో అనూహ్యంగా పుంజుకుంది కాబట్టి సమాజ్‌వాదీ పార్టీ సంతోషంగా ఉంది. ఎన్‌సీపీ(ఎస్పీ), శివసేన(యూబీటీ) వాటి చీలిక పక్షాల కంటే మెరుగైన ప్రదర్శన చూపాయి గనుక అవీ హ్యాపీనే. బెంగాల్‌లో దూకుడు చూపించి తృణమూల్ కాంగ్రెస్ కూడా ఆనందంగా ఉంది. ఈవీఎంలపై ఎలాంటి విమర్శలు రాకపోవడంతో అందుకు ఎన్నికల సంఘం హ్యాపీ. ‘సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్’ అంటే ఇదే కదా’’ అని చమత్కరించారు. ఈ పోస్టుపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Harsh Goenka Comment
ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఒంటరిగా 240 సీట్లు సాధించగా… దాని నేతృత్వంలోని కూటమికి 293 స్థానాలు దక్కాయి. ఇండియా కూటమి అభ్యర్థులు 233 చోట్ల విజయం సాధించారు. ఆ కూటమి ప్రధాన పార్టీ కాంగ్రెస్‌కు 99 సీట్లు వచ్చాయి. ఈక్రమంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీయే సన్నద్ధమవుతోంది. జూన్ 9న కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుతీరనున్నట్లు సమాచారం.
Also Read : Arvind Kejriwal : అరవింద్ కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టులో మరో ఆటంకం