Hazlewood : జోష్ హేజిల్‌వుడ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఈ ఆస్ట్రేలియన్ స్టార్ పేసర్ అద్భుతమైన బౌలింగ్ కు పెట్టింది పేరు. కట్టుదిట్టమైన బంతులతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించడంలో దిట్ట.
ఐపీఎల్ 2022లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు అద్భుత విజయాన్ని సాధించి పెట్టడంలో ప్రధాన పాత్ర పోషించాడు.
ఒకానొక దశలో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఉన్న మ్యాచ్ ను ఆర్సీబీకి దక్కేలే చేసిన ఘనత మాత్రం ఈ ఆసిస్ స్టార్ దే. 4 ఓవర్లు వేసిన జోష్ హేజిల్ వుడ్(Hazlewood) మూడు కీలక వికెట్లు తీశాడు.
కేవలం 28 రన్స్ మాత్రమే ఇచ్చాడు. బ్యాటింగ్ పరంగా దినేశ్ కార్తీక్ మెరిస్తే బౌలింగ్ పరంగా ఢిల్లీ క్యాపిటల్స్ పతనాన్ని శాసించాడు హేజిల్ వుడ్(Hazlewood). అతడి పూర్తి పేరు జోష్ రెజినాల్డ్ హాజిల్ వుడ్.
1991 జనవరి 8న పుట్టాడు. వరల్డ్ క్రికెట్ లో పేరొందిన స్టార్ పేసర్లలో హాజిల్ వుడ్ ఒకడు. అతడిని మరో స్టార్ పేసర్ గ్లెన్ మెక్ గ్రాత్ తో పోలుస్తారు అభిమానులు.
12 ఏళ్ల వయసులోనే మైదానంలో ఆడడం మొదలు పెట్టాడు. అతడికి చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే పిచ్చి. ఇక 17 ఏళ్ల వయసులోనే న్యూ సౌత్ వేల్స్ కు ఎంపికయ్యాడు.
2008లో న్యూజిలాండ్ జట్టుతో సిడ్నీ లో ఆడాడు. 2010 జూన్ 22న ఆసిస్ తరపున వన్డే లో అరంగేట్రం చేశాడు హేజిల్ వుడ్. ఆసిస్ తరపున అండర్ -19 కోసం ఆడాడు.
2020 ఐపీఎల్ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతున్నాడు. ఆ జట్టుకు విజయం సాధించి పెట్టాడు.
Also Read : ఉత్కంఠ పోరులో లక్నో ఘన విజయం