Christiano Ronaldo : ప్రపంచ ఫుట్ బాల్ క్రీడా రంగంలో చెరపలేని జ్ఞాపకమే కాదు నిరంతరం వెంటాడే ఆటగాడు అతడు. పోర్చుగల్ కు చెందిన రొనాల్డో. అతడి పూర్తి పేరు క్రిస్టియానో రొనాల్డో (Christiano Ronaldo)డాస్ శాంటాస్ అవిరో.
ఇవాళ అతడి పుట్టిన రోజు. సరిగ్గా ఇదే రోజు 1985 ఫిబ్రవరి 5న పుట్టాడు ఈ హీరో.
దేశం తరపున జాతీయ జట్టుకు 2003 నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. జువెంటస్ క్లబ్బుకు ఫార్వార్డ్ ప్లేస్ లో ఆడతాడు.
ప్రతి ఏటా ప్రకటించే ర్యాంకింగ్స్ లో అతడి పేరు తప్పనిసరిగా ఉండి తీరుతుంది. మోస్ట్ పాపులర్ హీరో రొనాల్డో.
ఒక్కసారి మైదానంలోకి వచ్చాడంటే బంతి గోల్ కావాల్సిందే.
వరల్డ్ వైడ్ గా చూస్తే అత్యంత ఎక్కువ గోల్స్ కొట్టిన వాళ్లల్లో రొనాల్డో టాప్ లో ఉన్నాడు.
అంటే అర్థం చేసుకోవచ్చు. అతడి స్టామినా ఏపాటిదో. గ్రౌండ్ లో పాదరసంలా కదలాడుతుంటాడు.
కను రెప్పలు కొట్టే లోపే గోల్ చేసేసి వెళ్లి పోతాడు రొనాల్డో.
అతడికి ప్రపంచ వ్యాప్తంగా లెక్కించ లేనంత మంది అభిమానులు ఉన్నారు. ఇక అతడి ఆదాయం గురించి ఎంత చెప్పినా తక్కువే.
ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ఆదాయం గడిస్తున్న ఆటగాళ్లలో అతడు కూడా ఒకడుగా ఉన్నాడు.అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే బ్యాలన్ డి ఓర్ అవార్డు పొందాడు. నాలుగు యూరోపియన్ గోల్డెన్ షూస్ గెలుచుకున్నాడు.
ఈ రెండు పురస్కారాలు అందుకున్న ఏకైక యూరోపియన్ ఫుట్ బాల్ ప్లేయర్ రొనాల్డో. తన కెరీర్ లో 30 ప్రధాన ట్రోఫీలను గెలుచుకున్నాడు.
వీటిలో ఏడు లీగ్ టైటిల్స్ , ఐదు యూఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్ , యూరోపియన్ ఛాంపియన్ షిప్ , నేషన్స్ లీగ్ టైటిళ్లు ఉన్నాయి. ఫుట్ బాల్ చరిత్రలో అత్యధిక గోల్స్ 134 రొనాల్డో పేరు మీదే నమోదై ఉన్నాయి.
తాను ప్రాతినిధ్యం వహించే క్లబ్, దేశం కోసం 750 కి పైగా గోల్స్ కొట్టాడు. 100 ఇంటర్నేషనల్ గోల్స్ సాధించిన ఏకైక రెండో ప్లేయర్ రొనాల్డో. రొనాల్డో(Christiano Ronaldo) మరిన్ని గోల్స్ సాధించి చరిత్ర సృష్టించాలని కోరుకుందాం.
Also Read : కుర్రాళ్లూ ప్రపంచ కప్ తో రండి