Rahul Dravid Covid : హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కు కరోనా – బీసీసీఐ
టెస్టుల్లో కోవిడ్ -19 పాజిటివ్ నిర్ధారణ
Rahul Dravid Covid : ఆగస్టు 27 నుండి ప్రారంభం కానున్న మెగా ఈవెంట్ ఆసియా కప్ కు ముందు భారత జట్టుకు కోలుకోలేని షాక్ తగిలింది. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కు కరోనా సోకింది.
ఈ విషయాన్ని బీసీసీఐ తో పాటు ద్రవిడ్ ప్రకటించడం గమనార్హం. ద్రవిడ్ కు కోవిడ్ -19 పరీక్షలు చేయడంతో పాజిటివ్(Rahul Dravid Covid) అని తేలింది. ఇదిలా ఉండగా బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ లో వెల్లడించింది.
టీమిండియా హెడ్ కోచ్ ద్రవిడ్ ఆసియా కప్ 2022 కోసం యూఏఈకి బయలు దేరే ముందు సాధారణ పరీక్షలు చేపట్టడం జరిగింది. ఆయనకు పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది.
ప్రస్తుతం రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) క్షేమంగానే ఉన్నారు. ఆయనకు బీసీసీఐ వైద్య బృందం చికిత్సలు అందిస్తోంది. ఆయన వారి పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాడని తెలిపింది.
తేలికపాటి లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని ఏమంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బీసీసీఐ పేర్కొంది. ఈ విషయాన్ని వైద్య బృందం వెల్లడించిందని తెలిపింది.
ఒకవేళ రాహుల్ ద్రవిడ్ కోలుకున్నట్లు తేలితే వెంటనే యూఏఈకి బయలు దేరి వెళతాడని స్పష్టం చేసింది బీసీసీఐ. ఇదిలా ఉండగా టోర్నీలో భాగంగా భారత జట్టు తన చిరకాల ప్రత్యర్థి ఆగస్టు 28న పాకిస్తాన్ తో ఆడనుంది.
ప్రస్తుతం కేఎల్ రాహుల్ సారథ్యంలోని టీమిండియా మూడు వన్డేల సీరీస్ ను జింబాబ్వేపై గెలుపొందింది. ఇందులో కొందరు మాత్రమే ఆసియా కప్ లో ఆడనున్నారు.
ఇదిలా ఉండగా గత ఏడాది టీ20 వరల్డ్ కప్ తర్వాత సీనియర్ జట్టు హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు చేపట్టాడు.
Also Read : యుఎస్ ఓపెన్ నుండి సానియా ఔట్