#Mushroom : పుట్టగొడుగులు ఉపయోగాలు తెలుసా ?

పుట్టగొడుగులను వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

Mushroom : పుట్టగొడుగులు ఈ మధ్య కాలంలో ఎక్కువగా లభ్యమవుతున్నాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. రోజువారీ ఆహారంలో పుట్టగొడుగులను చేర్చడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. తినడానికి రుచికరంగా ఉండటమే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగివుండే పుట్టగొడుగుల్లో కేలరీలు తక్కువ. ఆకలిని తగ్గిస్తుంది. ఫలితంగా బరువు తగ్గుతారు.

పుట్టగొడుగులలో విటమిన్ బి1, బి2, బి3, బి5, బి9లు ఉన్నాయి. ఇందులోని విటమిన్‌-బి ప్రధానంగా ఒత్తిడి, యాంగ్జయిటీలను తగ్గిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తాయి. యాంటి-ఇన్‌ఫ్లమేటరీ, యాంటి-ఆక్సిడెంట్ల సుగుణాలు వీటిల్లో బాగా ఉన్నాయి. వేసవికాలంలో పుట్టగొడుగులను తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాదు వీటిని తినడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు తగ్గుతాయి.

పుట్టగొడుగులలో పొటాషియం, ప్రోటీన్, రాగి, సెలీనియం, భాస్వరం, ఫైటోకెమికల్స్, విటమిన్లు సి, డి వంటి అనేక పోషకాలు ఉండడం వల్ల శరీరాన్ని అనేక వ్యాధుల నుండి దూరంగా ఉంచుతాయి. పుట్టగొడుగులను తినడం వల్ల ఎముకలు బలపడతాయి. వీటిలో డి-విటమిన్‌ బాగా ఉండడం వల్ల చర్మంపై మొటిమలు, ఎలర్జీలు దరి చేరవు.

No comment allowed please