Lovers Day : ప్రేమంటే హృదయాల సంగమం. మనసుల ఆలింగనం. కొన్ని చెప్పుకోలేం. ఇంకొన్ని మరిచి పోలేం అదే ప్రేమంటే. కోల్పోవడాలూ ఏవీ ఉండవు కానీ అర్పించు కోవడాలూ ఉంటాయి.
అవును లోకంలో ప్రతి ఒక్కరికీ ఓ కథంటూ ఉంటుంది. ప్రతి సందర్భానికి ఓ రోజుంటూ ఉంది.
అలాగే ప్రేమకు కూడా. ప్రేమ వేరు ప్రేమికుల రోజు(Lovers Day )వేర్వేరు కాదు.
ప్రేమ ఆనందాన్నిస్తుంది. ఆవేదన నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కన్నీళ్లను దాటుకునేలా చేస్తుంది. ఒకటా రెండా ఓటమి నుంచి రక్షించే శక్తిని ఇస్తుంది.
అంతేనా విజయం సాధించేందుకు కావాల్సిన బలాన్ని, మనో శక్తిని ఇస్తుంది. గెలిచిన ప్రతి ఒక్కరిలో ప్రేమన్నది ఉంటుంది. లేకపోతే ప్రేమించలేం.
ప్రేమించాలంటే మనం ముందుగా అర్పించుకునే స్థాయిలో ఉండాలి.
అపుడే ప్రేమ పండుతుంది. జీవితం కావాలనిపిస్తుంది. ప్రేమ కనిపిస్తుంది.
అది కళ్లల్లో ఓ మెరుపు.పెదవులపై నవ్వు. ఒకరిని విడిచి ఉండలేని స్థితిలోకి నెట్టేస్తుంది.
బలహీనులు ఇంకా లీనమై పోతారు. అదే ప్రేమ అనుకుని కూరుకు పోతారు. చివరికి ఓటమి అంచుల్లోకి వెళ్లిపోతారు.
ఇదంతా ప్రేమలోని మహిమ. నిన్ను నీవు కోల్పోయిన చోట నీ మనసు నిన్ను పలకరిస్తుంది.
నిన్ను నీవు గెలిచిన చోట నీ అడుగులు మరింత బలంగా ఉంటాయి.
అదే విజేతకు ఓటమికి ఉన్న తేడా. ప్రేమంటే ఏమిటంటే ప్రేమించాక తెలిసే అని కవి పాడుకున్నా నిజమైన ప్రేమ బతుకునిస్తుంది. బతకడం ఎలా నేర్పుతుంది.
ప్రేమించడం అంటే శ్వాసించడం అన్న మాట. లోకం ప్రకాశించాలన్నా..మనం బాగుండాలన్నా తప్పనిసరిగా రెండక్షరాల ప్రేమ పండాల్సిందే.
ప్రేమ ఆలాపన. ప్రేమ స్వర విన్యాసం. ప్రేమ బతుకు ప్రయాణం. ప్రేమ ఒంటరి దారుల్లో తోడుండే చేతి కర్ర. నువ్వు దుఖఃంలో ఉన్నావంటే నీలో ఇంకా ప్రేమ ఉన్నట్టే
. నీవు ఇంకొకరి కోసం వేచి చూస్తున్నావంటే నీలో ప్రేమ మొలకెత్తినట్టే.
నీ కోసం ఇంకొకరు నిరీక్షిస్తున్నారంటే నీకూ ఇంకొకరికి మధ్య ప్రేమబంధం విడదీయలేని అనుబంధమై అల్లుకు పోయినట్లే.
ప్రేమమయం కావడం వల్లనే ఇంకా ఈ విశ్వం సూర్య చంద్రులతో నిండి పోయింది.
గాలి కదిలినా..పూలు విరబూసినా..ఆకులు రాలినా అదీ ప్రేమే(Lovers Day ). ప్రేమ అక్కడా ఇక్కడా అని లేదు.
అంతటా ఉన్నది. అంతర్వాహిణిగా మనలోపటే మిలితమై పోయింది.
మనం తెర మీద చూసి ప్రేమనుకుంటాం. అది నటన కానీ పండితే అదీ ప్రేమంటే.
పూలను చేతిలోకి తీసుకున్నప్పుడు. గుండెల్లో మొలకెత్తే స్పందనలన్నీ ప్రేమకు సంకేతాలు.
నువ్వు లేక పోతే నేను లేను. నువ్వున్నావన్న..నీతోడుందన్న నమ్మకమే నన్ను నడిపిస్తోంది.
నడిచేలా చేస్తోంది. ఈ శక్తి..ఈ ప్రయత్నం..ఈ ఆలోచన..ఈ సంచారమంతా ప్రేమతో(Lovers Day ) కలిగిన ప్రపంచంతో అనుసంధానమై ఉండడం వల్ల వచ్చింది. ప్రేమ ఎప్పటికీ నిలిచే ఉంటుంది.
నీడలా వెన్నంటి ఉంటుంది. ప్రేమ మధురమైన భావన. మనమధ్య బంధం బలపడాలన్నా..మనకు మనం అర్థం కావాలన్నా..
ఇంకొకరిని ఆహ్వానించాలన్నా..వారితో సుదీర్ఘ ప్రయాణం చేయాలన్నా ప్రేమ ఉండాల్సిందే.
అది లేక పోతే బతుకు శూన్యమవుతుంది. లోకం బరువుగా తోస్తుంది. ప్రేమ ప్రపంచాన్ని చుట్టేసింది.
తన చుట్టూ అల్లుకు పోయేలా చేసింది. అదీ ప్రేమంటే. ప్రేమ ఏమీ కోరదు.
ఇంకేదీ అడుగదు. కేవలం తనతో పాటే ఉండిపోమని అంటుంది.
ప్రేమా పరవశించనీ ప్రేమ పరిఢవిల్లనీ ..ప్రేమ ప్రవహించనీ..ప్రేమ కరుణించనీ..ప్రేమ మనల్ని మనలా ఉండేలా చేస్తుంది.
ప్రేమ మధురం..ప్రేమ సుమధురం..ప్రేమ జ్ఞాపకం. ప్రేమ వెంటాడే వెచ్చని కలబోత. గుండెల్ని పిండేసే స్మతి గీతిక.
ప్రపంచమే ప్రేమమయం అయినప్పుడు ఇక ప్రేమకు రోజు ఏమిటి..ప్రతి క్షణం..ప్రతి నిమిషం ..ప్రతిదీ ప్రేమతనమే.
Also Read : సమతా స్పూర్తి చిన్నజీయర్ దిక్సూచి