Virat Kohli Gambhir Hated : కోహ్లీ గంభీర్ గరం గరం
మరోసారి బయటపడ్డ విభేదాలు
Virat Kohli Gambhir Hated : వాళ్లిద్దరూ సహచరులు. ఇద్దరూ కలిసి ఎన్నో మ్యాచ్ లలో ఆడారు. కానీ ఎందుకనో ఆ ఇద్దరికి ఒకరంటే మరొకరికి పడదు. కారణం వ్యక్తిగత ఇబ్బందులు ఉండవచ్చు. ఆ ఇద్దరు ఎవరో కాదు ఒకరు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న విరాట్ కోహ్లీ. మరొకరు మాజీ క్రికెటర్, ఢిల్లీ భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ, లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు మెంటర్ గా వ్యవహరిస్తున్న గౌతం గంభీర్.
ఐపీఎల్ 16వ సీజన్ లో భాగంగా యూపీలోని లక్నో మైదానంలో ఆర్సీబీతో లక్నో సూపర్ జెయింట్స్ తలపడింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 126 రన్స్ చేసింది. అనంతరం లక్నో ఛేదనలో చతికిలపడింది. ఆర్సీబీ బౌలర్ల దెబ్బకు లక్నో విల విల లాడింది. కేవలం 108 పరుగులకే చాప చుట్టేసింది. ఆర్సబీ బౌలర్లలో కర్ణ్ శర్మ 20 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీస్తే జోష్ హేజిల్ వుడ్ 2 వికెట్లు తీసి సత్తా చాటారు.
ఇక మ్యాచ్ అనంతరం ఎప్పటి లాగే ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇరు జట్లు కరచాలనం చేసుకునే సమయంలో లక్నో మెంటర్ గౌతం గంభీర్ , ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli Gambhir Hated) మధ్య మరోసారి మాటల యుద్దం కొనసాగింది.
దీంతో పక్కనే ఉన్న ఆటగాళ్లు ఆ ఇద్దరిని పక్కకు తప్పించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి నెట్టింట్లో. ఆదర్శంగా ఉండాల్సిన ఆటగాళ్లు ఇలా ప్రవర్తిస్తే ఎలా అని నెటిజన్లు, క్రికెట్ ఫ్యాన్స్ మండి పడుతున్నారు.
Also Read : రాణించిన డుప్లెసిస్..విరాట్ కోహ్లీ
