Heavy Rain Bangalore : భారీ వర్షం బెంగళూరు అస్తవ్యస్తం
ఎక్కడికక్కడ స్తంభించిన ట్రాఫిక్
Heavy Rain Bangalore : మరోసారి కర్ణాటక రాజధాని బెంగళూరును వర్షాలు(Heavy Rain Bangalore) ముంచెత్తాయి. పెద్ద ఎత్తున కురుస్తున్న వర్షాల దెబ్బకు జన జీవనం స్తంభించి పోయింది. ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచి పోయాయి. పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యాయి. ఒక రకంగా నగరం ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందులు పడిందని చెప్పక తప్పదు.
రోడ్లు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఓపెన్ మ్యాన్ హోల్స్ లోకి నీరు ప్రవేశించాయి. బేస్ మెంట్ పార్కింగ్ లు, వాహనాలు కొన్ని కొట్టుకు పోయాయి. నిన్న రాత్రి ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. దీంతో భారీ వర్షం దెబ్బకు రోడ్లన్నీ జలమయం కావడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఇళ్లకు వెళ్లే వారంతా ఆపీసుల్లోనే ఉండి పోయారు. వందలాది మంది మెట్రో స్టేషన్లలో తలదాచుకున్నారు. బెంగళూరు లోని ఐటీ జోన్ తో సహా నగరంలోని తూర్పు, దక్షిణ , మధ్య భాగంలోని ఆర్టీరియల్ రోడ్లు పూర్తిగా నీళ్లతో నిండి పోయాయి. మహా నగరం పూర్తిగా నీళ్లతో దర్శనం ఇచ్చింది.
ఉత్తర ప్రాంతంలోని రాజమహల్ గుట్టహళ్లిలో 59 మిల్లీమీటర్ల వర్ష పాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇదిలా ఉండగా రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో వర్షాలు ప్రారంభమైనందున — ఇంటికి వెళ్లే కార్యాలయానికి వెళ్లేవారు మెట్రో స్టేషన్లలో తలదాచుకోవలసి వచ్చింది.
భారీ వర్షం కారణంగా మెజెస్టిక్ సమీపంలో గోడ కూలడంతో రోడ్డుపై పార్క్ చేసిన పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. గత నెలలో వరుసగా మూడు రోజుల వర్షం తర్వాత బెంగళూరు ఇబ్బందులకు గురైంది. భారీ వర్షం కారణంగా మెజెస్టిక్ సమీపంలో గోడ కూలడంతో రోడ్డుపై పార్క్ చేసిన పలు నాలుగు చక్రాల వాహనాలు ధ్వంసమయ్యాయి.
Also Read : మురుగ మఠాధిపతి శివమూర్తిపై మరో కేసు