Henrich Klassen : హెన్రిచ్ క్లాసెన్ సెన్సేషన్
దంచి కొట్టిన క్రికెటర్
Henrich Klassen : ఢిల్లీలో జరిగిన కీలకమైన లీగ్ మ్యాచ్ లో ఎట్టకేలకు విజయాన్ని సాధించింది సన్ రైజర్స్ హైదరాబాద్. ప్లే ఆఫ్ ఆశలు ఇంకా సజీవంగా ఉన్నాయి. ఈ కీలక పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ కు చేదు అనుభవం మిగిలింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. భారీ టార్గెట్ ఛేదనలో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ చివరి దాకా పోరాడింది. కానీ 9 188 పరుగులకే పరిమితమైంది.
సన్ రైజర్స్ హైదరాబాద్ స్కిప్పర్ ఐడెన్ మార్క్రమ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆరంభంలోనే 4 వికెట్లు వరుసగా తక్కువ పరుగుల తేడాతో కోల్పోయింది. ఈ సమయంలో కనీసం 100 పరుగులు కూడా హైదరాబాద్ దాటుతుందని అనుకోలేదు. కానీ ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఓ వైపు వికెట్లు రాలుతున్నా ఎక్కడా తగ్గలేదు. కేవలం 36 బంతులు మాత్రమే ఎదుర్కొన్న ఈ యువ క్రికెటర్ ఏకంగా 67 రన్స్ చేసి కీలక పాత్ర పోషించాడు.
మైదానంలోకి వచ్చిన హెన్రిచ్ క్లాసెన్(Henrich Klassen) సెన్సేషన్ ఇన్నింగ్ ఆడాడు. 27 బంతులు మాత్రమే ఎదుర్కొని 53 రన్స్ చేశాడు. చివరి దాకా నిలిచాడు. ఆఖరులో వచ్చిన అబ్దుల్ సమద్ 28 కీలక రన్స్ చేశాడు.
Also Read : ఫిల్ సాల్ట్ మెరిసినా తప్పని ఓటమి