Twitter Alternative : ట్విట్టర్ కు ప్రత్యామ్నాయం ఇదిగో
పలు సోషల్ మీడియా యాప్స్
Twitter Alternative : ట్విట్టర్ కు వరల్డ్ వైడ్ లో ఎక్కువగా ఖాతాదారులు కలిగి ఉన్నంది ఆసియాలో భారత్ లోనే. టెస్లా సిఇఓ , చైర్మన్ రూ. 4,400 కోట్లకు ట్విట్టర్ ను టేకోవర్ చేసుకున్నాక కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. నిన్నటి దాకా ప్రశాంతంగా పని చేసుకుంటూ వస్తున్న ఉద్యోగులంతా మస్క్ తీసుకుంటున్న ఆకస్మిక నిర్ణయాలకు వణుకుతున్నారు.
ఈ తరుణంలో బ్లూ టిక్ కావాలంటే రుసుము చెల్లించాలంటూ చేసిన ప్రకటన, సీనియర్లు గుడ్ బై చెప్పడం ట్విట్టర్ కు శాపంగా మారింది. దీంతో చాలా మంది ట్విట్టర్ ను వీడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. యూజర్లు ట్విట్టర్ కు ప్రత్యామ్నాయం(Twitter Alternative) వైపు చూస్తున్నారు.
ఇందులో ఇండియాకు చెందిన సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లు ఉన్నాయి. కేంద్ర సర్కార్ ఆత్మ నిర్భర్ పేరుతో సామాజిక కమ్యూనిటీలు, యాప్ లకు మద్దతు ఇస్తోంది. ఇందులో ప్రధానంగా 2020లో కుటుంబు – Kutumb పేరుతో ఏర్పాటు చేశారు.
ఇందులో చిత్రాలు, వీడియోలు, న్యూస్ పంపుకునే అవకాశం కల్పిస్తోంది. ఇది షేరింగ్ యాప్ గా ఆదరణ చూరగొంటోంది. 6 మిలియన్ల మంది ఉన్నారు. గూగుల్ ప్లే స్టోర్ లో కోటికి పైగా డౌన్లోడ్ చేసుకోవడం విశేషం.
రెండోది భారతీయులు తయారు చేసిన మరో సోషల్ యాప్ కూ – Koo. ఇది ట్విట్టర్ కు పోటీగా ఆదరణ చూరగొంది. మాతృ భాషల్లో టెక్స్ట్, ఆడియో, వీడియోలు సులువుగా పంచుకోవచ్చు.
గూగుల్ యాప్ లో కోటికి పైగా డౌన్ లోడ్ లను కలిగి ఉంది. మరో సోషల్ యాప్ మైలో mylo . ఇది కొత్త వారు, తల్లులు కావాల్సిన వారు ఇందులో ఎక్కువగా ఉన్నారు. ఐటీసీ సపోర్ట్ తో వెలుగొందుతోంది.
ఇది పలు భాషల్లో అందుబాటులో ఉంది. దీనిని 50 లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. షీ రోస్ – she rose మరో సోషల్ యాప్. ఇందులో మహిళలకు అధిక ప్రాధాన్యత. 10 లక్షలకు పైగా డౌన్ లోడ్ చేసుకున్నారు.
మరో సోషల్ యాప్ లెహర్ -leher. ఇది పూర్తిగా వివిధ అంశాలకు సంబంధించి చర్చా వేదికగా మారింది. మరొకటి ఎన్ బ్లిక్ కూడా పేరొందింది. ఇది స్వచ్చంధ సంస్థలకు ఉపయోగకరంగా మారింది.
Also Read : ఫేక్ ఖాతాల ఎఫెక్ట్ సబ్‌స్క్రిప్షన్ కు చెక్