AP DSC 2024: డీఎస్సీ నోటిఫికేషన్ పై హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు ?
డీఎస్సీ నోటిఫికేషన్ పై హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు ?
AP DSC 2024: వైసీపీ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన దాదాపు 57 నెలలు తరువాత మెగా డిఎస్సీ పేరుతో 6,100 టీచర్ పోస్టుల భర్తీకు ఇచ్చిన నోటిఫికేషన్ పై రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ పై అసంతృప్తి వ్యక్తం చేసింది. సెకండరీ గ్రేట్ టీచర్ పోస్టులకు బీఈడీ అభ్యర్ధులను అనుమతించడాన్ని హైకోర్టు ప్రాథమికంగా తప్పుబట్టింది. అద్దంకి వాసి బొల్లా సురేష్, మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లపై మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఎస్జీటీ పోస్టులకు బీఎడ్ అభ్యర్థులను అనుమతించటం సుప్రీంకోర్టు(Supreme Court) నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు ముందు వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం వల్ల డీఎడ్ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని కోర్టుకు తెలిపారు. ఎన్సీఈటీ నిబంధనలకు పూర్తి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఖాళీల భర్తీ ప్రక్రియ చేపట్టిందన్నారు.
AP DSC 2024 Updates
దీనితో ఎస్జీటీ అభ్యర్థులు తక్కువగా ఉన్న కారణంగానే బీఎడ్ అభ్యర్థులను అనుమతించాల్సి వస్తోందని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. అర్హత సాధించిన బీఎడ్ అభ్యర్థులు రెండేళ్ల బ్రిడ్జి కోర్స్ చేసిన తర్వాతే… బోధనకు అనుమతిస్తామన్నారు. సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా నోటిఫికేషన్ ఎలా ఇస్తారు ? బ్రిడ్జి కోర్సుకి చట్టబద్ధత ఏముందని ఏజీని న్యాయస్థానం ప్రశ్నించింది. తక్షణమే నోటిఫికేషన్ నిలుపుదల చేస్తామంటూ ఉత్తర్వులిచ్చేందుకు ధర్మాసనం సిద్ధపడింది. అయితే ప్రభుత్వ వివరణ తీసుకొనేందుకు ఒక్కరోజు సమయం కావాలని ఏజీ కోర్టును అభ్యర్థించడంతో తదుపరి విచారణను న్యాయస్థానం బుధవారానికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 23 నుంచి హాల్ టికెట్లు ఇచ్చే ప్రక్రియ కొనసాగనుందని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. దీనితో హాల్ టికెట్లు జారీ చేయకుండా ఉత్తర్వులు ఇస్తామని ధర్మాసనం తెలిపింది.
Also Read : MLA Alla Ramakrishna Reddy : ఏపీ కాంగ్రెస్ కు బిగ్ షాక్..మల్లి తన గూటికి చేరుకున్న వైసీపీ ఎమ్మెల్యే