Wrestlers Protest : జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద ఉద్రిక్త‌త‌

మ‌హిళా రెజ్ల‌ర్ల‌కు రైత‌న్న‌ల మ‌ద్ద‌తు

Wrestlers Protest : డ‌బ్ల్యూఎఫ్ఐ చీఫ్ , బీజేపీ ఎంపీ బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్ సింగ్ పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ గ‌త ఏప్రిల్ 23 నుంచి ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద నిర‌స‌న దీక్ష చేప‌ట్టారు మ‌హిళా రెజ్ల‌ర్లు(Wrestlers Protest). కేసు న‌మోదు చేయ‌క పోవ‌డంతో సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. చివ‌ర‌కు కోర్టు ఆదేశాల‌తో బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్ సింగ్ పై 2 కేసులు న‌మోదు చేశారు.

ఇక అర్ధ‌రాత్రి ఉన్న‌ట్టుండి ఢిల్లీ ఖాకీలు దీక్షా స్థ‌లం వ‌ద్ద‌కు చేరుకున్నారు. శాంతియుతంగా ఆందోళ‌న చేప‌ట్టిన రెజ్ల‌ర్ల‌పై దాడికి దిగారు. వారిని నానా దుర్భాషలాడారు. ఈ ఘ‌ట‌న‌పై మ‌హిళా రెజ్ల‌ర్లు క‌న్నీటి ప‌ర్యంతం అయ్యారు. ఇందుకోసమేనా తాము దేశం కోసం ప‌త‌కాలు సాధించామంటూ సీనియ‌ర్ రెజ్ల‌ర్ వినీతా ఫోగ‌ట్ ఆవేద‌న చెందారు. ఖాకీల తీరుపై ఆమె నిప్పులు చెరిగారు.

మ‌రో రెజ్ల‌ర్ బ‌జ్ రంగ్ పునియా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. నేర‌స్థుడైన బ్రిజ్ భూష‌ణ్ ను అరెస్ట్ చేయాల్సింది పోయి త‌మ‌పై దాడుల‌కు దిగుతారా అంటూ మండిప‌డ్డారు. తన‌కు వ‌చ్చిన ప‌త‌కాల‌ను తిరిగి కేంద్రానికి ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. దీంతో తీవ్ర ఉద్రిక్త‌త చోటు చేసుకుంది జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద‌. పోలీసుల‌ను భారీగా మోహ‌రించారు.

ప్ర‌తిప‌క్షాలు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశాయి. మ‌హిళా రెజ్ల‌ర్లు(Wrestlers Protest) అని చూడ‌కుండా ఖాకీలు ఎలా దాడికి పాల్ప‌డతారంటూ ప్ర‌శ్నించాయి. ఇప్ప‌టికే వీరికి ప్రియాంక గాంధీ, సిద్దూ, సీఎం కేజ్రీవాల్ , మాజీ గ‌వ‌ర్న‌ర్ స‌త్య పాల్ మాలిక్ , త‌దిత‌రులు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. మాజీ కెప్టెన్ క‌పిల్ దేవ్ , ఒలింపియ‌న్ నీర‌జ్ చోప్రా రెజ్ల‌ర్ల‌కు బేష‌ర‌తు స‌పోర్ట్ ప్ర‌క‌టిస్తున్న‌ట్లు తెలిపారు.

Also Read : ప‌త‌కాలు తిరిగి ఇచ్చేస్తున్నా – పునియా

Leave A Reply

Your Email Id will not be published!