Hijab Protests Iran : ధిక్కార స్వరం దిగొచ్చిన ప్రభుత్వం
ఇరాన్ అటార్నీ జనరల్ కీలక కామెంట్స్
Hijab Protests Iran : మహిళలకు సంబంధించి హిజాబ్ వివాదం ఇరాన్ ను అట్టుడికించేలా చేసింది. చిన్నారుల నుంచి పెద్దల దాకా సర్కార్ తీసుకు వచ్చిన కఠినతరమైన చట్టాన్ని నిరసించారు. పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. మహిళలు తమ జుట్టును సైతం కత్తరించుకుని వినూత్న నిరసన ప్రకటించారు.
పోలీసుల వేధింపులు, కాల్పులు, కేసులు, అరెస్టులు మిన్నంటినా ఎక్కడా తగ్గలేదు మహిళలు(Hijab Protests Iran). మరింతగా తమ ఉద్యమాన్ని ఉధృతం చేశారు. మతం పేరుతో తమపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తే ఊరుకో బోమంటూ హెచ్చరించారు. ఓ వైపు తుపాకుల మోత ఇంకో వైపు ధిక్కార స్వరాల నినాదాలతో ఇరాన్ గత కొంత కాలం నుంచి అగ్నిగుండంగా మారింది.
రోజు రోజుకు పోరాటం మరింతగా బలంగా మారితే ప్రభుత్వానికి ఇబ్బందికరం అవుతుందని ఇరాన్ సర్కార్ భావించింది. ఎట్టకేలకు ఆ దేశ అటార్నీ జనరల్ కీలక వ్యాఖ్యలు చేశారు హిజాబ్ వివాదంపై. తాజాగా కఠినమైన హిజాబ్ చట్టాన్ని పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
గత సెప్టెంబర్ నెలలో ఇరాన్ లో 22 ఏళ్ల మహసా అమిని పోలీసు కస్టడీలో మరణించింది. దీనీపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది ప్రపంచ వ్యాప్తంగా. దీనిని నిరసిస్తూ వేలాది మంది రోడ్లపైకి వచ్చారు. మహిళలు, యువతులకు పురుషులు సైతం మద్దతుగా నిలిచారు.
ప్రస్తుతం ఇరాన్ పార్లమెంట్, న్యాయ వ్యవస్థ దేశంలో ప్రభుత్వం తీసుకు వచ్చిన హిజాబ్ చట్టాన్ని సమీక్షిస్తోంది. ఈ విషయాన్ని ఆ దేశ అటార్నీ జనరల్ మహ్మద్ జాఫర్ వెల్లడించారు. మరి చట్టాన్ని రద్దు చేస్తారా లేక ఏమైనా మార్పులు చేస్తారా అన్నది వేచి చూడాలి.
Also Read : భారతీయులకు కెనడా బంపర్ ఆఫర్