Tom Sizemore Died : నటుడు టామ్ సైజ్ మోర్ కన్నుమూత
సేవింగ్ ప్రైవేట్ ర్యాన్ తో పాపులర్
Tom Sizemore Died : ప్రముఖ హాలీవుడ్ నటుడు టామ్ సైజ్ మోర్ కన్నుమూశారు. ఆయనకు 61 ఏళ్లు. సేవింగ్ ప్రైవేట్ ర్యాన్ , బ్లాక్ హాక్ డౌన్ తదితర చిత్రాలలో కఠినమైన పాత్రలలో నటించారు. తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. టామ్ సైజ్ మోర్ మరణంతో(Tom Sizemore Died) హాలీవుడ్ లో విషాదం అలుముకుంది. ఈ విషయాన్ని వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది. మాదక ద్రవ్యాల వ్యసనం , చట్టంతో రన్ ఇన్ లతో పోరాడినందుకు టామ్ సైజ్ మోర్ ప్రసిద్ది చెందారు.
ఆయన మేనేజర్ చార్లెస్ లోగో ఆయన మరణాన్ని ధ్రువీకరించారు. గత నెల ఫిబ్రవరి 18న బ్రెయిన్ అనూరిజమ్ తో బాధ పడుతూ ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చేరారు సైజ్ మోర్(Tom Sizemore) . కాలి ఫోర్నియాలోని బర్ బాంక్ లోని ఆస్పత్రిలో నిద్రలోనే ఆయన ప్రాణాలు విడిచారని లాగో వెల్లడించారు. డెట్రాయిన్ లోని స్థానికుడు. ఆయన తల్లి నగరానికి సంబంధించిన అంబుడ్స్ మెన్ లో పని చేసింది. టామ్ సైజ్ మోర్ తండ్రి న్యాయవాది, తత్వశాస్త్ర ప్రొఫెసర్. సైజ్ మోర్ వేన్ స్టేట్ యూనివర్శిటీకి హాజరయ్యాడు.
ఫిలడెల్ఫియాలోని టెంపుల్ యూనివర్శిటీ నుండి థియేటర్ లో గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందారు. న్యూయార్క్ సిటీలో వెయిటింగ్ టేబుల్స్ లో , నాటకాల్లో ఔత్సాహిక నటుడిగా, దర్శకుడు ఆలివర్ స్టన్ 1989లో యుద్ద వ్యతిరేక చిత్రం బోర్న్ ఆన్ ది ఫోర్త్ ఆఫ్ జూలైలో కీలక పాత్రలో టామ్ సైజ్ మోర్ నటించాడు. ఈ పాత్రలతో ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందాడు.
Also Read : డబ్ల్యూపీఎల్ లో తారల సందడి