Home Minister Anitha : మగ పిల్లలను సరిగ్గా పెంచితే ఇన్ని ఘోరాలు జరుగుతాయా..?

ఆడపిల్లలను పద్ధతిగా పెంచినట్లే, మగపిల్లలను తల్లిదండ్రులు పెంచాలి...

Home Minister : డ్రగ్స్ తీసుకుంటేనే, స్మగ్లింగ్ చేస్తేనే హీరోలా చూస్తున్నారని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఇవాళ(ఆదివారం) ఉదయం పాలకొల్లులో ‘సేవ్ గర్ల్ చైల్ఢ్’ పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా 2కే రన్ ప్రారంభించారు. ఇందులో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భారీగా బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక నేతలు, హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్ నాగరాణి, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హోంమత్రి అనిత మాట్లాడారు.

Home Minister Anitha Comments..

‘‘మనమగ పిల్లలను సరిగ్గా పెంచితే, ఈ రోజు ఇన్ని ఘోరాలు జరుగుతాయా. ఆడపిల్లలను పద్ధతిగా పెంచినట్లే, మగపిల్లలను తల్లిదండ్రులు పెంచాలి. నెలల పిల్లల్లోనూ ఆడదాన్ని చూస్తున్న మృగాలు ఉన్న సమాజంలో ఉన్నాం. నెలల పిల్లలపైనా, ఆరేళ్ల చిన్నారుల పైనా అకృత్యాలు జరుగుతున్నాయి. ఆడపిల్లలను రక్షిస్తే, హీరోలా చూసే రోజులు రావాలి’’ అని హోంమంత్రి అనిత తెలిపారు.

Also Read : AP MP’s : టీడీపీ ఎంపీ చిన్ని, జనసేన ఎంపీ బాలశౌరిలకు పార్లమెంట్ కీలక పదవులు

Leave A Reply

Your Email Id will not be published!