Home Minister Anitha : మాజీ సీఎం జగన్ ని వాళ్ళ పార్టీ నేతలే నమ్మడం లేదు

అలాగే జగన్‌పై ఎమ్మెల్యే సోమిరెడ్డి, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు...

Home Minister : మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డిపై హోంమంత్రి అనిత(Vangalapudi Anitha) కీలక వ్యాఖ్యలు చేశారు. తల్లి, చెల్లి ఇద్దరిపై ఏదో రోజు జగన్ కేసు పెడతాడని తాను ముందే అనుకున్నానని .. ఇప్పుడు అదే జరిగిందన్నారు. సీఎం కుర్చీ కోసం సొంత బాబాయిని చంపేశారని మండిపడ్డారు. మరో చెల్లి న్యాయం కోసం ఢిల్లీ చుట్టూ తిరిగినా న్యాయం చేయలేకపోయారన్నారు. అన్న జగన్ కోసం గతంలో షర్మిల పాదయాత్ర చేసి.. ఎంతో కష్టపడ్డారని గుర్తుచేశారు. ‘‘ కానీ మేము ఇప్పుడు చెల్లికి తల్లికి మేము రక్షణ కల్పిస్తున్నాం’’ అని స్పష్టం చేశారు. వాళ్ల పార్టీ నేతలే జగన్‌ను నమ్మే పరిస్థితి లేదని… అందుకే వాసిరెడ్డి పద్మతో సహా అందరూ పార్టీని వీడుతున్నారన్నారు. వైసీపీ వాళ్లు టీడీపీ పార్టీతో టచ్‌లో ఉండటం అనేది అధిష్టానం చూసుకుంటుందన్నారు. రాజకీయ లబ్ధి కోసమే విజయనగరం జిల్లా గుర్ల బాధితులను పరామర్శిస్తున్నారని మండిపడ్డారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో ఘోరాలు జరిగినా ఏనాడు బాధితులను దగ్గరికి వెళ్లలేదంటూ హోంమంత్రి అనిత(Home Minister) ఆగ్రహం వ్యక్తం చేశారు.

Home Minister Anitha Slams..

అలాగే జగన్‌పై ఎమ్మెల్యే సోమిరెడ్డి, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లీ చెల్లికి ఆస్తి ఇవ్వనంటూ కోర్టుకెళ్లడం జగన్(YS Jagan) క్రూర మనస్తత్వానికి నిదర్శనమంటూ మండిపడ్డారు. అసలు ఆస్తి కోసం తల్లీ – చెల్లిని బ్లాక్మైల్ చేసిన వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రి అని పిలవాలన్నా అసహ్యం వేస్తోందని సోమిరెడ్డి అన్నారు. జగన్ అనుభవిస్తున్న ఆస్తి ప్రజలదని తెలిపారు. సరస్వతీ పవర్‌కు కేటాయించిన ప్రభుత్వ భూమి 30 ఏళ్ల లీజును జగన్ పొడిగించుకున్నారన్నారు. ప్రజల సొమ్మును వీళ్లకు ఎందుకు దారాదత్తం చేయాలని ప్రశ్నించారు. జగన్ ఒప్పుకుంటే సరస్వతీ పవర్ 1500 ఎకరాలను మూడు భాగాలు చేసి ఒక భాగం రైతులకిచ్చి, మిగిలిన రెండు భాగాలను జగన్, షర్మిలకు సమానంగా పంచుతామని తెలిపారు. తండ్రిని ఈడీ కేసులో ఇరికించి, ఆస్తి కోసం తల్లీ – చెల్లిపై కేసుపెట్టడం ఎక్కడా చూడలేదన్నారు. అలాంటి జగన్ నోట తల్లీ, చెల్లీ అనే మాటలు వినలేకపోతున్నామని సోమిరెడ్డి వ్యాఖ్యలు చేశారు.

నైతిక విలువలు లేకుండా సొంత తల్లి, చెల్లిపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ కోర్టుకు ఎక్కడం సిగ్గుచేటని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. తల్లి , చెల్లిని ఇబ్బందులు పెట్టడం చూస్తే జగన్ రెడ్డి చరిత్ర హీనుడుగా నిలుస్తారన్నారు. జగన్ రెడ్డి బరితెగింపు చూస్తే ఆయన వెనుక పెద్ద తలకాయలు ఉన్నాయని అనుమానం కలుగుతోందన్నారు. ప్రధాని కూడా జగన్ రెడ్డి అక్రమ సంపాదనపై విచారణ చేయించాలన్నారు. జగన్ రెడ్డి ఆస్తులను కేంద్రం స్వాధీనం చేసుకొని జాతీయీకరణ చేయాలని డొక్కా మాణిక్య వరప్రసాద్ డిమాండ్ చేశారు.

Also Read : Amaravathi Railway Line : అమరావతి రైల్వే లైన్ కి కేంద్ర రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్

Leave A Reply

Your Email Id will not be published!