Rohini Acharya ED : గ‌ర్భ‌వ‌తిని ఈడీ వేధిస్తే ఎలా – రోహిణి

ద‌ర్యాప్తు సంస్థ తీరుపై ఆగ్ర‌హం

Rohini Acharya ED : కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ బీహార్ డిప్యూటీ సీఎం తేజ‌స్వి యాద‌వ్ ఇంటితో పాటు 24 ప్రాంతాల్లో దాడులు చేప‌ట్టింది. భూమి, ఉద్యోగాల స్కాంకు సంబంధించి ఇప్ప‌టికే మాజీ సీఎంలు ర‌బ్రీ దేవి, లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ ల‌ను ప్ర‌శ్నించింది. శుక్ర‌వారం జ‌రిగిన దాడుల్లో త‌న సోద‌రుడు డిప్యూటీ సీఎం తేజ‌స్వి యాద‌వ్ భార్య గ‌ర్భిణీతో ఉన్నా కూడా వేధింపుల‌కు గురి చేశారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది లాలూ కూతురు రోహిణి ఆచార్య‌(Rohini Acharya ED).

ఆమె దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు. ఎందుకంటే త‌న తండ్రి కోసం త‌న కిడ్నీని దానం చేసింది. ఆప‌రేష‌న్ కూడా స‌క్సెస్ అయ్యింది. కేంద్రం కావాల‌ని త‌మ కుటుంబాన్ని టార్గెట్ చేసిందంటూ ఆరోపించింది. ఎవ‌రైనా గ‌ర్భిణీ అని చూడ‌లేద‌ని వాపోయింది. ఇదేనా ప్ర‌జాస్వామ్యం అని ప్ర‌శ్నించింది రోహిణి ఆచార్య‌. లాలూ ర‌బ్రీ కుటుంబం ఫాసిస్టులు, అల్ల‌రి మూక‌ల ముందు త‌ల‌వంచ‌క పోవ‌డ‌మే తాము చేసిన నేర‌మా అని నిల‌దీసింది.

ఢిల్లీ లోని డిఫెన్స్ కాలనీ లోని తేజ‌స్వి యాద‌వ్ ఇంటితో పాటు యాద‌వ్ కూతుళ్లు రాగిణి యాద‌వ్ , చందా యాద‌వ్ , హేమ యాద‌వ్ , పాట్నా లోని ఆర్జేడీ మాజీ ఎమ్మెల్యే అబు డోజానాను ప్ర‌శ్నించింది కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌. పుల్వారీ ష‌రీఫ్ , ఢీల్లీ ఎన్సీఆర్ , రాంచీ, ముంబైకి చెందిన ప్రాంతాల‌లో సోదాలు జ‌రిపింది ఈడీ(Rohini Acharya ED).

గ‌ర్భ‌వ‌తి అని కూడా చూడ‌కుండా వేధిస్తున్నారంటూ వాపోయింది రోహిణి ఆచార్య‌. కేంద్రం కావాల‌ని క‌క్ష సాధిస్తోందంటూ ఆరోపించారు డిప్యూటీ సీఎం తేజ‌స్వి యాద‌వ్.

Also Read : 9 జోన్ల‌పై సౌత్ గ్రూప్ ప‌ట్టు – ఈడీ

Leave A Reply

Your Email Id will not be published!