CJ Chandrachud : రాసే స్వేచ్ఛను అడ్డుకోలేం – చంద్రచూడ్
జుబైర్ కేసులో సీజే చంద్రచూడ్ కామెంట్
CJ Chandrachud : మత పరమైన మనోభావాలు దెబ్బ తినేలా ట్వీట్లు చేశాడనే ఆరోపణలపై ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్ న్యూస్ కో ఫౌండర్ మహ్మద్ జుబైర్ కు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
బుధవారం తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా డివై చంద్రచూడ్(CJ Chandrachud) తో కూడిన ధర్మాసనం సంచలన కామెంట్స్ చేశారు.
ఈ సందర్భంగా చోటు చేసుకున్న వాదనలు ఆసక్తికరంగా మారాయి. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తరపున వాదించిన న్యాయవాది జుబైర్ ఇక నుంచి
ట్వీట్లు చేయకుండా నిరోధించాలని కోర్టుకు విన్నవించారు.
దీనిపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు చీఫ్ జస్టిస్ డైవై చంద్రచూడ్. వాదించవద్దని లాయర్ కి చెప్పండి అనేలా ఉంది మీ కోరిక. రాయొద్దంటూ ఎలా చెప్పగలం. రాజ్యాంగం ప్రతి ఒక్కరికి మాట్లాడే,
తమ అభిప్రాయాలను తెలియ చేసే హక్కు, స్వేచ్ఛ ఉందని మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు. ఒక జర్నలిస్ట్ కి రాయ కూడదంటూ ఎలా
చెప్పగలవు అంటూ నిలదీశారు.
జుబైర్ పై నమోదైన ఏడు కేసులకు సంబంధించి మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ధర్మాసనం స్పష్టం చేసింది. బుధవారం సాయంత్ర లోపు విడుదల చేయాలని ఆదేశించింది.
ఒక వేళ జుబైర్ ఉల్లంఘించే పని చేస్తే అతను చట్టానికి జవాబుదారీ. ఒక పౌరుడు తన స్వరాన్ని పెంచుతున్నప్పుడు అతడిపై ముందస్తు
చర్యలను తీసుకోగలమన్నారు.
పబ్లిక్ గా లేదా ప్రైవేట్ గా చేసే పనులకు అతడే జవాబుదారీ గా ఉంటాడని పేర్కొన్నారు జస్టిస్ చంద్రచూడ్(CJ Chandrachud). అరెస్టుల
అధికారాన్ని పొదుపుగా కొనసాగించాలన్నది చట్టం నిర్దేశిత సూత్రం.
ప్రస్తుతం అతడిని నిరంతర నిర్బంధంలో ఉంచేందుకు ఎటువంటి సమర్థన లేదన్నారు. పిటిషనర్ కు మధ్యంతర బెయిల్ కు అర్హత ఉంది.
బెయిల్ బాండ్లను పాటియాలా కోర్టు ముందు సమర్పించాలి.
ఆ వెంటనే తీహార్ జైలు జుబైర్ ను కస్టడీ నుండి విడుదల చేయాలని స్పష్టం చేశారు జస్టిస్ చంద్రచూడ్.
Also Read : ఉద్దవ్ ఠాక్రేకు షాక్ షిండేకు ఊరట