#Rasgulla : రసగుల్ల ఎలా చేయాలో మీకు తెలుసా ?

రసగుల్ల బెంగాల్ లో ఫేమస్ స్వీట్.

Rasgulla : భారతదేశ ప్రజలకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం. పండగయినా, ఏదయినా శుభకార్యమైన స్వీట్స్ తప్పనిసరిగా ఉండాలి. అలాంటి వాటిలో రసగుల్ల ఒకటి. రసగుల్ల బెంగాల్ లో ఫేమస్ స్వీట్. అక్కడి ప్రజలు దీనిని చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఎంతో రుచిగా ఉండే రసగుల్ల ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.. దీనికి కావలసిన పదర్ధాలు, తయారుచేయు విధానం ఇప్పుడు చూద్దాం..

కావలసిన పదార్ధాలు :

పాలు – 2 లీటర్లు
నిమ్మరసం – 1/4 కప్పు
మైదా – 1 టీస్పూన్‌
పంచదార – 2 కప్పులు
యాలకులపొడి – 1/2 టీ స్పూన్‌

తయారుచేయు విధానం :

ముందుగా ఒక పాత్రలో పాలు తీసుకొని మరిగించాలి. మరుగుతున్న పాలలో నిమ్మరసం వేసి కలపాలి. పాలు పగిలి గడ్డలు గడ్డలుగా తయారవుతుంది. తరువాత స్టవ్‌ ఆర్పేసి పాత్ర పక్కన పెట్టాలి. చల్లారిన తరువాత ఒక పలుచని వస్త్రం సహాయంతో పాల మిశ్రమాన్ని వడబోసి, వస్త్రాన్ని దగ్గరకు కట్టి నీళ్లు పూర్తిగా పోయేలా చేయాలి. తరువాత ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

తర్వాత ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని పంచదార వేసి మరిగించాలి. పంచదార పానకం మరుగుతున్న సమయంలోనే చేసి పెట్టుకున్న ఉండలను వేసి మూత పెట్టాలి. పది నిమిషాల తరువాత స్టవ్‌ ఆర్పేయాలి. ఆవిరి పూర్తిగా పోయే వరకు మూత తీయకూడదు. పంచదార పానకాన్ని గ్రహించి రసగుల్లల సైజు రెట్టింపు అవుతుంది. చల్లారిన తరువాత యాలకుల పొడి వేసుకొని తింటే ఈ రసగుల్లలు భలే రుచిగా ఉంటాయి.

No comment allowed please