#BellyFat : డెలివరీ తర్వాత వచ్చే పొట్టను తగ్గించే చిట్కా..
బరువు తగ్గడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు.
BellyFat : ఆడవారు ప్రెగ్నెన్సీ సమయంలో చాలా బరువు పెరుగుతారు. డెలివరీ తర్వాత చాలా మందిలో పొట్ట, నడుము భాగంలో కొవ్వు పెరిగిపోయి అసహ్యంగా ఉండటమే కాకుండా బయటకు వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఇందుకు కారణం ప్రెగ్నెన్సీ సమయంలో పొట్ట కండరాలు వదులుగా మారడం వల్ల డెలివరీ అయ్యాక పొట్ట ఉబ్బుగా, ఎత్తుగా, లూజ్ గా ఉంటుంది.
బరువు తగ్గడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఎలాంటి ప్రయోజనం ఉండదు. బరువు తగ్గాలని ఎక్కువుగా డైటింగ్ చేయడం వల్ల బరువుతగ్గకపోగా నీరసం వస్తుంది. బరువు తగ్గించుకోకపోతే అనేక రకాల అనారొగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి డెలివరీ తర్వాత వచ్చే పొట్టను తగ్గించుకోవటానికి కొన్ని సులభమైన చిట్కాలను తెలుసుకుందాం.
ఒక గిన్నెలో 2 కప్పుల నీరు, 4 యాలకులు, 1 స్పూన్ సోంపు వేసి బాగా మరిగించాలి. ఈ నీటిని వడగట్టి పరగడుపున గోరువెచ్చగా ఉన్నప్పుడు త్రాగాలి. ఈ విధంగా పరగడుపున త్రాగటం వలన జీవక్రియ రేటు పెరిగి పొట్టలో కొవ్వు కరుగుతుంది. అంతేకాకుండా తల్లిపాలను పెంచటంలోనూ సహాయం చేస్తుంది. కాబట్టి ఈ చిట్కా తల్లి, బిడ్డ ఇద్దరికీ ఆరోగ్యపరంగా సహాయపడుతుంది.
నీరు తాగిన 10 నిమిషాల తర్వాత పొట్ట మీద నువ్వుల నూనె రాసి సున్నితంగా మసాజ్ చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో కాపడం పెట్టటం వలన పొట్ట మీద కండరాలు టైట్ గా మారతాయి. ఇలా చేయటం వలన డెలివరీ తర్వాత వచ్చే స్ట్రెస్ మార్క్స్ కూడా తొలగిపోతాయి. తర్వాత పొట్టకు సంబందించిన వ్యాయామాలు చేసి చివరగా స్నానం చేయాలి. ఈ విధంగా ప్రతి రోజు క్రమం తప్పకుండా చేస్తే మీ పొట్టలో వచ్చిన మార్పును మీరే గమనిస్తారు.
No comment allowed please