HS Prannoy : గెలుపులో వాట్సాప్ గ్రూప్ కీలకం
వెల్లడించిన హెచ్ఎస్ ప్రణయ్
HS Prannoy : 73 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం తొలిసారిగా స్వర్ణం సాధించింది భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు. 14 సార్లు ఛాంపియన్ గా ఉన్న ఇండోనేషియాకు చుక్కలు చూపించింది. ఫైనల్ లో 3-0 తేడాతో ఓడించి థామస్ కప్ చేజిక్కించుకుంది.
ఈ అసాధారణమైన గెలుపు వెనుక వాట్సాప్ గ్రూప్ కీలకంగా వ్యవహరించిందంటే నమ్మగలమా. అవును ఇది నిజమేనని అంటున్నారు హెచ్. ఎస్. ప్రణయ్(HS Prannoy). ఈ గ్రూప్ ఎంతో సహాయ పడిందన్నారు.
కిదాంబి శ్రీకాంత్ అత్యున్నత ర్యాంకర్ గా ఉన్న జోనాథణ్ క్రిస్టీని ఓడించడంతో టైటిల్ కైవసం చేసుకుంది. మూదటి మూడు మ్యాచ్ ల్లోనే భారత్ టైటిల్ కైవసం చేసుకోవడంతో హెచ్. ఎస్. ప్రణయ్ కు కోర్టులో ఆడే అవకాశం రాలేదు.
ఈ షట్లర్ భారత్ ఫైనల్ కు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇట్స్ కమింగ్ హోమ్ పేరుతో వాట్సాప్ గ్రూప్ తయారు చేశామన్నాడు. ఇది భారత దేశం సాధించిన విజయంలో కీలక పాత్ర పోషించిందన్నాడు.
ఇది ప్లేయర్లు తమ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు అందించేందుకు ఏర్పాడు చేశామన్నాడు. దీని వల్ల ప్లేయర్లకు ఎంతో లాభం చేకూరిందన్నాడు. ఈ విజయం ఊరికే రాలేదు. ఇందులో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి.
గ్రూప్ దశలో చైనీస్ తైపీతో ఓడి పోయామన్నాడు. ప్రణయ్ 21-13, 21-8 తో మలేషియాకు చెందిన లియోంగ్ జున్ హావోను ఓడించి టోర్నీలో భారత్ కు తొలి పతకాన్ని ఖాయం చేశామన్నాడు.
ప్రణయ్ డెన్మార్క్ కు చెందిన జెమ్కేతో పోటీ పడ్డాడు. మొదటి గేమ్ లో ఓడి పోయి నా ఆ తర్వాత పుంజుకుని గెలుపు సాధించాడు. మొత్తంగా వాట్సాప్ గ్రూప్ కీలకంగా మారిందని పేర్కొన్నాడు ప్రణయ్(HS Prannoy).
Also Read : ఈ విజయం సమిష్టి కృషికి సంకేతం