Sanju Samson : యూఏఈలో ‘సంజూ బాబా’కు య‌మ క్రేజ్

సంజూ బాబా ఆడక పోవ‌డం బాధాక‌రం

Sanju Samson :  కేర‌ళ స్టార్ హిట్ట‌ర్ గా పేరొందిన సంజూ శాంస‌న్(Sanju Samson)  గురించి ఎంత చెప్పినా త‌క్కువే. అల‌వోక‌గా బంతుల్ని సిక్స‌ర్లు, ఫోర్లుగా మ‌లిచే అద్భుత‌మైన టెక్నిక్ క‌లిగిన ఏకైక ఆట‌గాడిగా గుర్తింపు పొందాడు.

అందుకే దిగ్గ‌జ శ్రీ‌లంక క్రికెట‌ర్ రాజ‌స్థాన్ రాయ‌ల్స్ హెడ్ కోచ్ కుమార సంగ‌క్క‌ర ఏకంగా ఆకాశానికి ఎత్తేశాడు రాయ‌ల్స్ కెప్టెన్ సంజూ శాంస‌న్ ను.

ఈ ఏడాది భార‌త్ లో జ‌రిగిన ఐపీఎల్ లో ఏకంగా త‌న జ‌ట్టును షేన్ వార్న్ త‌ర్వాత ఫైన‌ల్ కు తీసుకు వెళ్లాడు. చివ‌ర్లో ఓడి పోయినా వేలాది మంది క్రికెట్ అభిమానుల‌ను సంపాదించుకున్నాడు.

విచిత్రం ఏమిటంటే ఈ స్టార్ హిట్ట‌ర్ సంజూ శాంస‌న్ కు ప్ర‌తి దేశంలోనూ అభిమానులు ఉండ‌డం విస్తు పోయేలా చేస్తోంది.

విండీస్, జింబాబ్వే టూర్ లో ఉన్న‌ప్ప‌టికీ, అద్భుతంగా రాణించిన‌ప్ప‌టికీ ఎందుక‌నో బీసీసీఐ సెలెక్ట‌ర్లు సంజూ శాంస‌న్ పై శీత‌క‌న్ను ప్ర‌ద‌ర్శిస్తూ వ‌స్తున్నారు.

ప్ర‌స్తుతం యూఏఈ వేదిక‌గా ఆసియా క‌ప్ -2022 మెగా టోర్నీ ప్రారంభ‌మైంది. దాయాది దేశాలు భార‌త్ పాకిస్తాన్ దేశాల మ‌ధ్య కీల‌క‌మైన మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

ఇందు కోసం ఇరు జ‌ట్లు ప్రాక్టీస్ లో నిమ‌గ్నం అయ్యాయి. ఈ సంద‌ర్భంగా భార‌త క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌కు(Rohit Sharma) ఊహించ‌ని అనుభ‌వం ఎదురైంది.

విచిత్రం ఏమిటంటే మా సంజూ బాబా ఆడ‌క పోవ‌డం దారుణ‌మ‌ని ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. దీంతో రోహిత్ శ‌ర్మ సంజూ శాంసన్ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. చివ‌ర‌కు సంజూ బాబా ఎవ‌రంటూ విస్తు పోవ‌డం హిట్ మ్యాన్ వంతైంది.

Also Read : అరుదైన రికార్డ్ కు చేరువ‌లో ర‌న్ మెషీన్

Leave A Reply

Your Email Id will not be published!