LIC IPO : ఎల్ఐసీ ఐపీఓకు భారీ స్పంద‌న

ప‌బ్లిక్ ఇష్యూకు అనూహ్య ఆద‌ర‌ణ

LIC IPO  :  భార‌తీయ ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌ను గంప గుత్త‌గా అమ్ముకుంటూ వెళుతున్న బీజేపీ స‌ర్కార్ నెత్తీ నోరు బాదుకున్నా ప‌ట్టించు కోవ‌డం లేదు.

గ‌ణ‌నీయ‌మైన రీతిలో విశిష్ట సేవ‌లు అందిస్తున్న భార‌తీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)ని ప్రైవేట్ ప‌రం చేసే ప‌నిలో నిమగ్న‌మైంది. ఈ మేర‌కు ప‌బ్లిక్ ఇష్యూ జారీ చేసింది.

తొలి రోజు పాల‌సీదారుల విభాగంలో భారీగా స్పంద‌న ల‌భించింది. ఉద్యోగుల కోటా సైతం స‌బ్ స్క్రైబ్ అయిన‌ట్లు బీఎస్ఈ వెల్ల‌డించింది. రిజ‌ర్వ్ చేసిన 6.9 కోట్ల షేర్ల‌కు సంబంధించి 60 శాతం ద‌ర‌ఖాస్తులు ల‌భించిన‌ట్లు స‌మాచారం.

16.21 కోట్ల షేర్ల‌ను ఆఫ‌ర్ చేస్తే 10. 86 కోట్ల‌కు పైగా షేర్ల కోసం బిడ్స్ దాఖ‌లు కావ‌డం విశేషం. మొద‌టి రోజు 67 శాతం బిడ్స్ ల‌భించిన‌ట్లు స్టాక్ ఎక్స్ఛేంజ్ గ‌ణాంకాలు వెల్ల‌డించాయి.

మొద‌ట‌గా ఎల్ఐసీ ఐపీఓకు (LIC IPO )సంబంధించి షేరుకి రూ. 902-949 ధ‌ర నిర్ణ‌యించింది. 3.5 శాతం వాటాకు స‌మానమైన 22.13 కోట్ల ఈక్విటీ షేర్ల‌ను అమ్మ‌కానికి పెట్టింది.

ఈనెల 4 నుంచి 9వ తేదీ వ‌ర‌కు జారీ చేసిన ఇష్యూస్ ద్వారా కేంద్ర ప్ర‌భుత్వం రూ. 20 వేల కోట్ల‌కు పైగా స‌మీక‌రించాల‌ని డిసైడ్ అయ్యింది. ఎల్ఐసీ షేర్ల‌కు సంబంధించి ఒక్కో షేరు ధ‌ర‌లో రూ. 60 శాతం డిస్కౌంట్ ప్ర‌క‌టించింది.

ఇక సంస్థ‌లో ప‌ని చేస్తున్న ఎంప్లాయిస్ , రిటైల్ ఇన్వెస్ట‌ర్ల‌కు రూ. 45 చొప్పున రాయితీ ఇస్తోంది. నిన్ని ప్రారంభ‌మైన ఒక్క రోజే రూ. 5, 627 కోట్లు స‌మ‌కూరింది. ఎల్ఐసీ 17న స్టాక్ ఎక్స్చేంజ్ లో లిఫ్ట్ కానుంది.

Also Read : ట్విట్ట‌ర్ ఫ్యూచ‌ర్ పై ఎలోన్ మ‌స్క్ కామెంట్

Leave A Reply

Your Email Id will not be published!