Elon Musk : మస్క్ జాబ్ ప్రకటన భారీగా స్పందన
ట్విట్టర్ లో ట్వీట్ చేసిన టెస్లా సిఇఓ, చైర్మన్
Elon Musk : ప్రపంచ దిగ్గజ వ్యాపారవేత్త, టెస్లా సిఇఓ, చైర్మన్ ఎలోన్ మస్క్ (Elon Musk) నిత్యం వార్తల్లో ఉంటున్నారు. ట్విట్టర్ లో ఏదో ఒకటి పోస్ట్ చేస్తూ మరింత ఆసక్తిని, ఉత్కంఠను రేకెత్తిస్తున్నారు.
తాజాగా ఆయన తన స్వంత కంపెనీలో పని చేసేందుకు నిపుణులైన వారు కావాలంటూ ట్వీట్ చేశాడు. ఊహించని రీతిలో భారీగా స్పందన వచ్చింది. ఈ సందర్భంగా ఆయన తన జాబ్ యాడ్ లో కీలకమైన వ్యాఖ్యలు జోడించాడు.
అదేమిటంటే భావి అభ్యర్థులను అసాధారణమైన సామర్థ్యానికి రుజువు చూపించే మూడు నుండి ఐదు బుల్లెట్ పాయింట్లను పంచు కోవాలని కోరాడు మస్క్.
టెస్లా వ్యాజ్యాల (పిటిషన్లు)ను ప్రారంభించేందుకు , అమలు చేసేందుకు ఒక లిటిగేషన్ డిపార్ట్ మెంట్ ఏర్పాటు చేయాలని చూస్తోందని తెలిపాడు మస్క్.
ఇప్పటికే ఆయనను పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. ఎలోన్ మస్క్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిని ఆయన పూర్తిగా ఖండించారు.
తాను అలా చేసి ఉనట్లు రుజువులు చూపిస్తే ఏ శిక్ష వేసినా భరించేందుకు సిద్దంగా ఉన్నానంటూ ప్రకటించాడు మస్క్.
ఈ ఆరోపణల్ని ఖండించిన ఒక రోజు తర్వాత మస్క్ హార్డ్ కోర్ లిటిగేషన్ డిపార్ట్ మెంట్ ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించడం సంచలనం కలిగించింది.
హార్డ్ కోర్ స్ట్రీట్ ఫైటర్స్ కోసం వెతుకుతున్నానని, వైట్ షూ లాయర్ల కోసం మాత్రం కాదని పేర్కొన్నాడు ఎలోన్ మస్క్.
ప్రస్తుతం ప్రపంచంలోనే టాప్ కంపెనీగా పేరున్న టెస్లాలో తాము పని చేసేందుకు సిద్దంగా ఉన్నామంటూ ట్వీట్లతో హోరెత్తించారు. దీంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు ఎలోన్ మస్క్(Elon Musk).
Also Read : జిలింగో సిఇఓ అంకితి బోస్ పై వేటు