Ankiti Bose : జిలింగో సిఇఓ అంకితి బోస్ పై వేటు

అక్ర‌మాల విచార‌ణ నేప‌థ్యం

Ankiti Bose : ప్ర‌పంచ వ్యాప్తంగా పేరొందిన సింగపూర్ కు చెందిన ఫ్యాష‌న్ స్టార్ట‌ప్ కో ఫౌండ‌ర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ గా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్న భార‌త సంత‌తి (ఎన్నారై) కి చెందిన అంకిత్ బోస్(Ankiti Bose) పై వేటు ప‌డింది.

ఆర్థిక అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డిందంటూ వ‌చ్చిన ఫిర్యాదుల‌పై విచార‌ణ జరిపారు. అనంత‌రం ఆమెను తొల‌గిస్తున్న‌ట్లు యాజ‌మాన్యం ప్ర‌క‌టించింది. ఏడేళ్ల స్టార్ట‌ప్ బోర్డు మార్చిలో అంకిత్ బోస్ ను స‌స్పెండ్ చేసింది.

ఈ విష‌యంపై ద‌ర్యాప్తు చేసేందుకు ఒక స్వ‌తంత్ర సంస్థ‌ను నియ‌మించింది. సంస్థ ఆర్థిక స‌ల‌హాదారుని కూడా నియ‌మించింది. సింగ‌పూర్ టెక్నాల‌జీ ప‌రిశ్ర‌మ‌ను కుదిపేసిన లోతైన అకౌంటింగ్ ప్రాక్టీస్ సంక్షోభాన్ని కంపెనీ ఎదుర్కొంటోంది.

తీవ్ర‌మైన ఆర్థిక అవ‌క‌త‌వ‌క‌ల‌కు సంబంధించిన ఫిర్యాదుల‌ను ప‌రిశీలించేందుకు నియ‌మించ‌బ‌డిన స్వతంత్ర ఫోరెన్సిక్ సంస్థ నేతృత్వంలో ద‌ర్యాప్తు జ‌రిగింది. నివేదిక అందిన మేర‌కు అంకితి బోస్ ఉద్యోగాన్ని ర‌ద్దు చేయాల‌ని నిర్ణ‌యించింది.

త‌గిన చ‌ట్ట ప‌ర‌మైన చ‌ర్య‌ల‌ను ఆమెపై కొన‌సాగించే హ‌క్కును క‌లిగి ఉంద‌ని జిలింగో కంపెనీ ప్ర‌క‌టించింది. త‌న‌పై వేధింపుల‌కు పాల్ప‌డ్డారంటూ అంకితి బోస్ ఆరోపించారు.

ఇదిలా ఉండ‌గా దుస్తుల వ్యాపారులు, క‌ర్మాగారాల‌కు సాంకేతిక‌త‌ను స‌ర‌ఫ‌రా చేసే ఆన్ లైన్ స్టార్ట‌ప్ ను 2015లో అంకిత్ బోస్(Ankiti Bose) , చీఫ్ టెక్నాల‌జీ ఆఫీస‌ర్ ధ్రువ్ క‌పూర్ స్థాపించారు.

ఇందులో పెట్టుబ‌డి పెట్టిన వాటిలో సింగ‌పూర్ రాష్ట్ర హోల్డింగ్ కంపెనీ టెమా సెక్ , సీక్వోయా క్యాపిట‌ల్ ఉన్నాయి. ఇదిలా ఉండ‌గా అంకిత్ బోస్ కంపెనీ చేసిన ఆరోప‌ణ‌ల‌ను ఖండించారు.

వేధింపుల‌కు సంబంధించి తాను చేసిన ఫిర్యాదుల కార‌ణంగా త‌నను త‌ప్పించారంటూ వాపోయింది.

Also Read : మిస్త్రీ పిటిష‌న్ తిర‌స్క‌ర‌ణ టాటా స్పంద‌న‌

Leave A Reply

Your Email Id will not be published!