Hyd Liquor Shops : రేపు హైదరాబాద్ లో వైన్ షాపులు, బార్లు బంద్

Hyd Liquor Shops : మందుబాబులకు హైదరాబాద్ పోలీసులు బ్యాడ్‌న్యూస్ తెలిపారు. నగరంలోని వైన్ షాపులతో పాటు బార్లను ఒకరోజు పాటు బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మార్చి 30న శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్‌లోని మద్యం షాపులను బంద్ చేయాలని పోలీసులు యాజమానులను ఆదేశించారు.

శ్రీరామనవమి సందర్భంగా నగరంలో శోభాయాత్ర జరుగుతుంది. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పండుగ రోజు మద్యం షాపులను బంద్(Hyd Liquor Shops) చేయించనున్నారు. 30వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 31వ తేదీ నుంచి ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు బంద్ కానున్నాయి. 

వైన్ షాపులతో పాటు బార్లు, క్లబ్‌లు, పబ్బులు, ఫైవ్‌స్టార్ హోటళ్లలోని బార్ రూమ్‌లను కూడా క్లోజ్ చేయాలని హైదరాబాద్ పోలీసులు ఆదేశించారు.

ఎలాంటి ఘర్షణ వాతావరణం చోటుచేసుకోకుండా శ్రీరామనవమి వేడుకలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే మద్యం షాపులను మూసివేయించనున్నట్లు స్పష్టం చేశారు.

ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించి వైన్ షాపులు ఓపెన్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు. అలాగే బ్లాక్ మార్కెట్‌లో కూడా మద్యం విక్రయాలు జరిపితే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. తాము ఎక్కడికక్కడ పరిస్థితిని నిశితంగా పరీశీలిస్తామని పోలీసులు తెలిపారు.

అయితే శ్రీరామనవమి వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా జరుగుతాయి.  ఉదయం నుంచి దేవాలయాలు భక్తులతో కిక్కిరిసి కనిపిస్తాయి. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 

అలాగే పండుగ రోజు నగరంలో శోభాయాత్ర ప్రతి ఏడాది ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. హిందూ సంఘాలు శోభాయాత్ర నిర్వహిస్తూ ఉంటాయి. ఈ శోభాయాత్రలో వేలాదిమంది భక్తులు పాల్గొంటూ ఉంటారు. 

నగరవ్యాప్తంగా ప్రతీ ప్రాంతంలో ఈ శోభాయాత్ర జరుపుతారు. దీంతో నగరవ్యాప్తంగా పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నారు. 

అయితే వినాయకచవితి, హోలీ, గణేష్ నిమజ్జనం లాంటి పండుగల సమయాల్లో పోలీసులు నగరంలో మద్యం షాపులను బంద్(Hyd Liquor Shops) చేయిస్తూ ఉంటారు. 

అందులో భాగంగా శ్రీరామనవమి సందర్భంగా వైన్ షాపులను క్లోజ్ చేయించనున్నారు. ఇటీవల హోలీ సందర్భంగా కూడా రెండు రోజుల పాటు హైదరాబాాద్‌లో మద్యం షాపులను పోలీసులు మూసివేయించారు.

Also Read : ఉక్రెయిన్ మెడికల్ విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్

Leave A Reply

Your Email Id will not be published!