HYD Peddagattu Jathara : లింగా..ఓ లింగా అనే నామస్మరణతో మొదలైన పెద్దగుట్ట జాతర
ఈ నెల 20వ తేదీ వరకు ఈ ట్రాఫిక్ మళ్లింపు ఉంటుంది...
Peddagattu Jathara : శ్రీ లింగమంతులస్వామి(పెద్దగట్టు జాతర(Peddagattu Jathara) ప్రారంభమైంది. ఆదివారం అర్ధరాత్రి దేవరపెట్టె చేరుకోవడంతో దురాజ్ పల్లి పెద్దగట్టు జాతర ప్రారంభమైంది. ‘లింగ…ఓ లింగా’ నామస్మరణతో పెద్దగట్టు మారుమ్రోగుతోంది. గుట్ట చుట్టూ వాహనాలు చేరి.. జాతర భక్త జనసంద్రంగా మారింది. సోమవారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి లింగమంతుల స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. జాతర సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలకు జిల్లా కలెక్టర్ సెలవులు ప్రకటించారు.
Peddagattu Jathara Updates
కాగా తెలంగాణలో సమ్మక్క సారలమ్మ జాతర తరువాత రెండో అతిపెద్ద జాతరగా పేరొందిన సూర్యాపేట శ్రీ లింగమంతులస్వామి (పెద్దగట్టు) జాతర ఆదివారం రాత్రి ప్రారంభమైంది. జాతరలో కీలకమైన దేవరపెట్టె (అందెనపు చౌడమ్మ, లింగమంతుల స్వామి ఉత్సవ మూర్తులు)కు ఆనవాయితీ ప్రకారం కేసారం గ్రామంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవరపెట్టెను ఊరేగింపుగా ఆదివారం అర్ధరాత్రికి దురాజ్‌పల్లిలోని పెద్దగట్టుకు చేర్చారు. దీంతో జాతర ప్రారంభమైనట్లు నిర్వాహకులు ప్రకటించారు. కేసారంలోని మెంతబోయిన వంశస్తులకు చెందిన దేవరగుడిలో దేవరపెట్టెకు నిర్వహించిన ప్రత్యేక పూజల్లో మున్నా, గొర్ల, కులస్తులతోపాటు సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి, తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమే్‌షరెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఇక,పెద్దగట్టు జాతర(Peddagattu Jathara) నేపథ్యంలో హైదరాబాద్- విజయవాడ మార్గంలో ట్రాఫిక్ మళ్లింపు చేస్తున్నామని కోదాడ డీఎస్పీ ఎం. శ్రీధర్‌రెడ్డి తెలిపారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు కోదాడ సమీపంలోని బాలాజీనగర్ ఫ్లైఓవర్ వద్ద ట్రాఫిక్‌ను మళ్లించి, హుజుర్‌నగర్, మిర్యాలగూడ, నల్లగొండ, నార్కెట్‌పల్లి మీదుగా హైదరాబాద్‌కు పంపుతారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను కూడా అదే మార్గంలో కోదాడ వద్ద జాతీయ రహదారితో కలవనున్నాయి. ఈ నెల 20వ తేదీ వరకు ఈ ట్రాఫిక్ మళ్లింపు ఉంటుంది.
ఆదివారం అర్థరాత్రి 12 గంటలు దాటిన తర్వాత భక్తులు గంపలను నెత్తిపై పెట్టుకొని కాళ్లకు గజ్జెలు కట్టుకొని గొర్రెలకు అలంకరణ చేసి లింగమంతుల స్వామి గుడి చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణలు చేశారు. కుటుంబ సభ్యులంతా ప్రదక్షణలో పాల్గొన్నారు. అనంతరం గుట్టపైన జంతు బలులు జరిగాయి. సోమవారం ఆరు లక్షలకు పైగా భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. సోమవారం తెల్లవారుజాము నుంచి గుట్ట వద్ద భక్తులు పసుసు, కుంకుమతో బోనాన్ని అలంకరించుకొని ఆలయం చుట్టూ ప్రదక్షణలు చేసి దేవుళ్లకు బోనాలు సమర్పిస్తారు. బోనాల సమర్పణ సందర్భంగా ఆలయం కిటకిటలాడనుంది. పెద్దసంఖ్యలో భక్తులు హాజరవుతారని అంచనా. ఇందుకు తగ్గట్టుగా అధికారులు, దేవాలయ సమన్వయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు పూర్తిచేశారు.
Also Read : Kesineni Nani : తన రాజకీయ రిటైర్మెంట్ పై మరోసారి క్లారిటీ ఇచ్చిన మాజీ ఎంపీ