HYDRA : కూకట్ పల్లి లో ఒకేసారి 3 చోట్ల ‘హైడ్రా’ కూల్చివేతలు మొదలు
సంగారెడ్డి జిల్లాపై హైడ్రా దృష్టి సారించింది...
HYDRA : దాదాపు రెండు వారాల తర్వాత హైడ్రా కూల్చివేతలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈసారి కూకట్‌పల్లి ఏరియాలో హైడ్రా ఆపరేషన్ మొదలైంది. కూకట్‌పల్లి నల్లచెరువులో ఆక్రమణల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. నివాసం ఉన్న భవనాలు మినహా నిర్మాణంలో ఉన్న భవనాలను కూడా అధికారులు కూల్చివేస్తున్నారు. భారీగా పోలీసుల బందోబస్తుతో ఉదయాన్నే ఈ కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. మొత్తం మూడు చోట్ల హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కూకట్‌పల్లి నల్లచెరువులో ఎఫ్‌టీఎల్ నిర్మాణాలు నేలమట్టమయ్యాయి. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్, కృష్ణారెడ్డిపేటలో హైడ్రా కూల్చివేతలు వేగంగా కొనసాగుతున్నాయి. భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేత పనులు జరుగుతున్నాయి. కాగా నల్లచెరువు విస్తీర్ణం 27 ఎకరాలు ఉండగా అందులో 7 ఎకరాలు కబ్జాకు గురైంది. బఫర్ జోన్‌లో 25 అపార్ట్‌మెంట్లు, భవన నిర్మించారు. ఆక్రమణదారులకు హైడ్రా(HYDRA) అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. మొత్తం 16 నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు.
HYDRA…
సంగారెడ్డి జిల్లాపై హైడ్రా దృష్టి సారించింది. ఈ మేరకు జిల్లాలోని అమీన్‌పూర్ మండలంలో పలు ప్రాంతాల్లోని ప్రభుత్వ భూముల్లో నిర్మించిన భవనాలు, ఆక్రమణలను హైడ్రా బృందం నిన్న (శనివారం) పరిశీలించింది. కిష్టారెడ్డిపేటలో దర్గా పక్కన ప్రభుత్వ స్థలంలో నిర్మించిన 3 భవనాలను అధికారులు పరిశీలించారు. పూర్తి సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని రెవెన్యూ సిబ్బందికి సూచించారు. అనంతరం పటేల్‌గూడలోని సర్వే నం.12లో ఇళ్లను, ఐలాపూర్ గ్రామ పరిధిలోకి వచ్చే కోర్టు పరిధిలోని భూముల్లో అక్రమ నిర్మాణాలు జరిగినట్లు ఆరోపణలున్న భారీ అపార్ట్‌మెంట్లను, బీరంగూడ సంత పరిసరాల్లోని శంభునికుంటలోనూ ఆక్రమణలను పరిశీలించారు. చెరువు విస్తీర్ణం, ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ల హద్దులను గుర్తించారు. పరిశీలన జరిగిన మరుసటి రోజు ఉదయమే ఆపరేషన్ చర్యలను మొదలుపెట్టారు. దీంతో ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
Also Read : Gas Leak in Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో క్లోరిన్ గ్యాస్ లీక్ ! 60 మందికి అస్వస్థత !