Virat Kohli Podcast : ప్రతి గెలుపులోనూ నేనున్నా – కోహ్లీ
కానీ విఫలమైన కెప్టెన్ గా చిత్రీకరించారు
Virat Kohli Podcast : భారత క్రికెట్ మాజీ కెప్టెన్ , స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సంచలన కామెంట్స్ చేశారు. గత కొంత కాలంగా తనను ఓ విలన్ గా చిత్రీకరించే ప్రయత్నం చేశారంటూ వాపోయాడు.
ప్రస్తుతం ఐపీఎల్ లో ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆర్సీబీ పోడ్ కాస్ట్(Virat Kohli Podcast) తో తన అభిప్రాయాలను పంచుకున్నాడు. తాను ఎప్పుడు ఆడినా 100 శాతం ఆడాలని ప్రయత్నం చేశాడనని చెప్పాడు. ఇదే సమయంలో భారత జట్టు సాధించిన అనేక విజయాలలో , రికార్డులలో తాను భాగం పంచుకున్నానని స్పష్టం చేశాడు.
ఇదే క్రమంలో తాను వ్యక్తిగత రికార్డుల కోసం ప్రయత్నం చేయలేదన్నాడు. ఆడుతూ పోతూ ఉంటే రికార్డులు అవే వస్తాయని తాను నమ్ముతానని ఆ దిశగానే తాను ఆడుతున్నానని చెప్పాడు విరాట్ కోహ్లీ(Virat Kohli Podcast). కానీ భారత క్రికెట్ లో కొంత మంది తనను విఫలమైన స్కిప్పర్ గానే చూశారని వాపోయాడు. దీనికి తాను ఏమీ చేయలేదన్నాడు. విరాట్ కోహ్లీ పాడ్ కాస్ట్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విడుదల చేసింది.
నా కెరీర్ లో ఎంతో సంతృప్తిగా ఉన్నా. 2017 ఛాంపియన్స్ , 2019 ప్రపంచ కప్ లో జట్టుకు స్కిప్పర్ గా ఉన్నా. 2021లో టెస్టు ఛాంపియన్ షిప్ లో కెప్టెన్ గా కూడా తాను ఉన్నానని చెప్పాడు. ఇదే ఏడాదిలో టి20 వరల్డ్ కప్ కు నాయకుడిగా ఉన్నా. ఎక్కడ లేనో మీరే చెప్పాలన్నాడు. 2017 లో సెమీస్ కు, 2019లో సెమీ స్ కు చేరుకున్నామని చెప్పాడు. ఇన్ని ఉన్నా ఎందుకనో ఐసీసీ ట్రోఫీ గెలవలేదనే సాకుతో నన్ను ఇబ్బందికి గురి చేశాడని వాపోయాడు.
Also Read : వరల్డ్ కప్ ఫైనల్ కు చేరిన సౌతాఫ్రికా