Sharad Pawar : ప్రధాని రేసులో నేను లేను – పవార్
షాకింగ్ కామెంట్స్ చేసిన ఎన్సీపీ చీఫ్
Sharad Pawar : నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్(Sharad Pawar) షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను ప్రధానమంత్రి రేసులో లేనని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలన్నీ ఒకే వేదిక పైకి వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే ఓ అడుగు ముందుకు వేశారు జేడీయూ చీఫ్ , బీహార్ సీఎం నితీశ్ కుమార్. ఆయన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ , ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో కలిశారు.
ఇదే సమయంలో ఎన్సీపీ చీఫ్, ఏఐసీసీ చీఫ్ ఖర్గే, రాహుల్ గాంధీతో కూడా భేటీ అయ్యారు. ఈ తరుణంలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్(Sharad Pawar) , నితీశ్ కుమార్ బెంగళూరులో జరిగిన కాంగ్రెస్ ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో మరోసారి కలుసుకున్నారు. తాజాగా ఢిల్లీలో నితీశ్ ఖర్గే, రాహుల్ తో చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రతిపక్షాలు కలిసి వస్తే ఎవరు ప్రధానమంత్రిగా ఉంటారనే దానిని ముందే ప్రకటించాల్సి ఉంటుందని శరద్ పవార్ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఒకటి రెండు రోజుల్లో అన్ని పార్టీలు కలిసి చర్చించనున్నట్లు తెలిపారు శరద్ పవార్. అయితే దేశాభివృద్దికి పాటుపడే నాయకత్వాన్ని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయని చెప్పారు. పూణే యూనివర్శిటీ వీసీ రామ్ తకవాలే సంతాప సభలో పవార్ పాల్గొని ప్రసంగించారు.
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని, ఇక పీఎం రేసులో ఉండబోనంటూ మరోసారి కుండ బద్దలు కొట్టారు శరద్ పవార్.
Also Read : Amit Shah