Nitish Kumar : రాష్ట్రపతి పదవి రేసులో నేను లేను – నితీష్
బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి షాకింగ్ కామెంట్స్
Nitish Kumar : బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్(Nitish Kumar) సంచలన కామెంట్స్ చేశారు. గత కొంత కాలంగా తాను కూడా రాష్ట్రపతి పదవి రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోందన్నారు. కానీ ఆ పదవి రేసులో లేనని మరోసారి స్పష్టం చేశారు.
మంగళవారం సీఎం మీడియాతో మాట్లాడారు. నిన్నటి దాకా ఆర్జేడీ, బీజేపీ మధ్య సంబంధం ఉండేది. కానీ ఇప్పుడు మైత్రి బంధం చెడింది. దీంతో విపక్షాలన్నీ కలిసి నితీష్ కుమార్ ను నిలబెట్టాలని ఆ మధ్య పుకార్లు షికార్లు నిలబడ్డాయి.
ఈ తరుణంలో సీఎం చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. తాజాగా నితీష్ కుమార్(Nitish Kumar) కేంద్ర మంత్రి అమిత్ షాను టార్గెట్ చేశారు. ఎవరూ చరిత్రను మార్చలేరని బహిరంగంగా ఫైర్ అయ్యారు.
దీన్ని బట్టి చూస్తే ఇరు పార్టీల మధ్య బంధం చెడిందన్నది రూఢీ అయ్యింది. ఇదిలా ఉండగా రాష్ట్రపతి పదవీ కాలం పూర్తయింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది.
ఈనెల 15న నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. వచ్చే జూలై 18న పోలింగ్ జరగనుంది. అదే నెల 21న తుది అభ్యర్థి ఫలితాలు వెల్లడిస్తారు.
ఇదిలా ఉండగా మొత్తం కావాల్సిన బలం తక్కువగా ఉంది మోదీ నేతృత్వంలోని బీజేపీ సంకీర్ణ సర్కార్ కు. విపక్షాలకు అన్నీ కలిపితే ఎక్కువ ఓట్లు ఉన్నాయి. దీంతో ఉమ్మడి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు పావులు కదుపుతోంది బీజేపీ.
ఇక బీజేపీ నుంచి వెంకయ్య నాయుడు, తమిళి సై , మరో ఇద్దరు గవర్నర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇక కాంగ్రెస్ నుంచి గులాం నబీ ఆజాద్, శరద్ పవార్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక విపక్షాలకు సంబంధించి తెలంగాణ సీఎం కేసీఆర్ పేరు వినిపిస్తోంది.
Also Read : పరిశ్రమల ఏర్పాటుకు పూర్తి సహకారం