Singer Sunitha : ఎందుకు ఇష్ట పడుతున్నారో తెలియదు
గాయకురాలు సునీత షాకింగ్ కామెంట్స్
Singer Sunitha : ప్రముఖ గాయకురాలు ఉపద్రష్ట సునీత(Singer Sunitha) సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఎక్కువ సంఖ్యలో అభిమానులు ఉన్నారని కానీ వాళ్లు నా గాత్రాన్ని చూసి ఇష్ట పడుతున్నారో లేక తన అందాన్ని, చీరలను చూసి ఇష్ట పడుతున్నారో అర్థం కావడం లేదని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఫ్యాన్స్ విషయంలో చాలాసార్లు ఆలోచిస్తుంటా కానీ ఇప్పటి వరకు ఇంత పెద్ద ఎత్తున ఎందుకు ఉన్నారోనని. తాను ఎక్కడికి వెళ్లినా తన గురించి వాకబు చేస్తారని,
తనతో సెల్ఫీలు దిగేందుకు, మాట్లాడేందుకు ఉత్సుకత చూపిస్తారంటూ తెలిపారు సింగర్ సునీత. ఇక ఇప్పటి వరకు ఈ వేళలో నీవు అంటూ మెల్లగా స్టార్ట్ చేసిన ఆ గొంతు ఎన్నో పాటలకు ప్రాణం పోసింది.
గాయకురాలిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో పేరు సంపాదించారు సునీత. ఇటీవల ప్రముఖ వ్యాపారవేత్త రామ్ తో పెళ్లి కూడా చేసుకున్నారు.
ఈ రెండో వివాహంపై పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా చర్చ జరిగింది. తన అద్బుతమైన వాయిస్ తో లక్షలాది మంది హృదయాలను కొల్లగొట్టింది.
ఇక సునీత అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందరితో పాటు తను కూడా సామాజిక మాధ్యమాలలో బిజీగా ఉంటోంది.
తన ఫోటోలు, తన వ్యక్తిగత విషయాలు షేర్ చేస్తూ ఉంటుంది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయిన సునీత(Singer Sunitha) ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నా పాటల్ని ఇష్ట పడుతున్నారో లేక అందమా, చీరల్ని చూసి ఇష్ట పడుతున్నారో తెలియడం లేదని పేర్కొంది సునీత.
Also Read : మోస్ట్ వండర్ఫుల్ గా అధితి శంకర్ అందాల విందు